David Warner: వికెట్ తీసిన ఆనందంలో మహ్మద్ సిరాజ్.. వీడియో

India VS Australia: David Warner: భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. అయితే అంతకుముందే ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుకు టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్ షాకిచ్చాడు. కేవలం 5 పరుగులకే అతడ్ని వెనక్కి పంపాడు సిరాజ్.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2021, 09:34 AM IST
  • సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య ప్రారంభమైన మూడో టెస్టు
  • గాయాల తర్వాత జట్టులోకి వచ్చిన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఔట్
  • నాలుగేళ్ల తర్వాత డేవిడ్ వార్నర్ ఇలా ఔట్ కావడం ఇదే తొలిసారి
David Warner: వికెట్ తీసిన ఆనందంలో మహ్మద్ సిరాజ్.. వీడియో

India VS Australia: David Warner: భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. అయితే అంతకుముందే ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుకు టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్ షాకిచ్చాడు. తొలి రెండు టెస్టులకు గాయంతో దూరమైన ఆసీస్ ఓపెనర్ సిడ్నీ టెస్టులో బరిలోకి దిగగా.. కేవలం 5 పరుగులకే అతడ్ని వెనక్కి పంపాడు సిరాజ్.

ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు కేవలం 6 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అయితే స్వదేశంలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner) పది పరుగులలోపే వికెట్ చేజార్చుకోవడం చాలా అరుదు. రెండంకెల స్కోరు చేయకుండా స్వదేశంలో వార్నర్ ఔట్ కావడం గత నాలుగేళ్లలో ఇదే తొలిసారి. చివరగా 2016 నవంబర్ 12న దక్షిణాఫ్రికాతో టెస్టులో ఒక పరుగుకే వికెట్ సమర్పించుకున్నాడు.

Also Read: IND vs AUS 3rd Test: సిడ్నీ టెస్టుకు భారత జట్టు ఇదే..

 

మూడో టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ టీమ్ పైన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో డేవిడ్ వార్నర్, విల్ పకోస్కీతో కలిసి బ్యాటింగ్ ప్రారంభించాడు. అయితే మహ్మద్ సిరాజ్ బౌలింగ్ దాటికి వార్నర్ త్వరగా ఔటయ్యాడు. స్లిప్స్‌లో Team India ఆటగాడు చటేశ్వర్ పుజారా క్యాచ్ అందుకోవడంతో వార్నర్ నిరాశగా పెవిలిన్ చేరాడు. లంచ్ సమయానికి ఆసీస్ స్కోరు 21/1గా ఉంది.

Also Read: 1983 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్.. ఆసక్తికర విషయాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x