Team India announce Playing XI for The 3rd Test against Australia: ఆస్ట్రేలియాతో జరగనున్న మూడో టెస్టుకు భారత తుది జట్టును మేనేజ్‌మెంట్ ప్రకటించింది. చివరిసారి గతేడాది ఫిబ్రవరిలో అంతర్జాతీయ క్రికెట్ ఆడిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సిడ్నీ టెస్టు ద్వారా బరిలోకి దిగనున్నాడు. వరుసగా విఫలం అవుతున్న యంగ్ ఓపెనర్ షా, మయాంక్ అగర్వాల్‌లు బెంచ్‌కు పరిమితమయ్యారు.
గత టెస్టులో బౌలింగ్ చేస్తూ గాయపడ్డ కీలక బౌలర్ ఉమేశ్ యాదవ్ స్థానాన్ని భర్తీ చేశారు. ఉమేశ్ స్థానంలో నవదీప్ సైనీకి అవకాశం ఇచ్చారు. తద్వారా టెస్టుల్లో నవదీప్ సైనీ అరంగేట్రం చేయనున్నాడు. ఈ మిగతా రెండు టెస్టులకు సైతం అజింక్య రహానే సారథిగా వ్యవహరించనున్నాడు. రోహిత్ శర్మ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు. ఇది వరకే జరిగిన రెండు టెస్టుల తర్వాత 1-1తో ఆస్ట్రేలియా, భారత్(Team India) సమంగా ఉన్నాయి.
Also Read: Happy Birthday Kapil Dev: 1983 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్.. ఆసక్తికర విషయాలు
సిడ్నీ టెస్టుకు టీమిండియా తుది జట్టు:
అజింక్య రహానె (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, చటేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, అశ్విన్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ
Also Read: IND vs AUS 3rd Test: బీసీసీఐ శుభవార్త.. భారత జట్టుకు భారీ ఊరట
NEWS - #TeamIndia announce Playing XI for the 3rd Test against Australia at the SCG.
Navdeep Saini is all set to make his debut.#AUSvIND pic.twitter.com/lCZNGda8UD
— BCCI (@BCCI) January 6, 2021
ఇదివరకే రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ లాంటి ఆటగాళ్ల సేవలు కోల్పోయిన భారత క్రికెట్ జట్టు సిరీస్‌లో తదుపరి టెస్టులకు మరో కీలక ఆటగాడు కేఎల్ రాహుల్(KL Rahul) సేవల్ని కోల్పోనుంది. ఎడమచేతి మణికట్టు గాయంతో ఆస్ట్రేలియాతో జరగనున్న చివరి రెండు టెస్టులకు కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook