Rinku Singh Last Ball Six: వరల్డ్ కప్ ఫైనల్‌లో ఓటమిని కాస్త మైమరిపించేలా ఆస్ట్రేలియాపై టీమిండియా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. విశాఖ వేదికగా భారీగా స్కోర్లు నమోదైన ఉత్కంఠభరిత పోరులో భారత్ గెలుపొంది.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన కంగారూలు.. జోష్ ఇంగ్లిస్ (110) శతకంలో 20 ఓవర్లలో 208/3 భారీ స్కోరు చేసింది. అనంతరం సూర్యకుమార్ యాదవ్ , ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలతో భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. చివర్లో ఉత్కంఠ నెలకొన్నా రింకూ సింగ్ టెన్షన్ పడకుండా.. కూల్‌గా జట్టును గెలిపించాడు.
చివరి ఆరు బంతుల్లో విజయానికి ఏడు పరుగులు అవసరం కాగా.. సీన్ అబాట్ వేసిన చివరి ఓవర్‌లో అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్‌ల వికెట్లను భారత్ కోల్పోవడంతో మరింత నాటకీయంగా మారింది. ఇక చివరి బంతికి ఒక పరుగు అవసరం కాగా.. క్రీజ్‌లో రింకూ సింగ్ ఉన్నాడు. ఒక పరుగు ఇవ్వకూడదని ఆసీస్ మాస్టర్ ప్లాన్ వేసింది. సర్కిల్‌లో లోపల ఏకంగా 9 మందిని ఫీల్డర్లను మోహరించింది. అయితే రింకూ సింగ్ సిక్సర్ బాదేశాడు. సింగిల్ తీసేందుకు తానేమైనా సింపుల్ ప్లేయర్‌నా అనే రీతిలో భారీ సిక్సర్ బాదాడు. కాకపోతే ఆ బాల్ నో బాల్ కావడంతో అప్పటికే భారత్ విజయం ఖాయమైంది. దీంతో రింకూ బాదిన సిక్సర్ కౌంట్‌లోకి రాలేదు. ఐపీఎల్‌లో మెరుపులు మొదలుపెట్టి రింకూ సింగ్ సూపర్ ఫినిషర్‌గా ఎదుగుతున్నాడు.
Sit Back and Enjoy Rinku Singh Trademark finish for India in Ravi Shastri commentary on loop🦁🔥pic.twitter.com/qQGfk57igB
— KKR Bhakt 🇮🇳 ™ (@KKRSince2011) November 23, 2023
గుజరాత్ టైటాన్స్‌పై ఒకే ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాది రింకూ సత్తాచాటిన విషయం తెలిసిందే. రింకూ ప్రదర్శన ఇలానే ఉంటే.. వన్డేల్లో జట్టులోకి కూడా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. సరైన ఫినిషర్ లేని లోటు టీమిండియాలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో వైఫల్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఆసీస్‌తో ఫైనల్ మ్యాచ్‌లో సూర్య ఆటతీరు అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. టీ20ల్లో పూనకం వచ్చినట్లు ఆడే సూర్యా.. వన్డేల్లో మాత్రం తేలిపోతున్నాడు. దీంతో ఫినిషర్‌గా రింకూ పేరును కూడా పరిశీలించే అవకాశం ఉంది.
ఇక గురువారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ అబ్బురపరిచింది. 2.3 ఓవర్లలో 22/2 కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్.. తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. క్రీజ్‌లోకి రావడంతోనే బాదుడు మొదలుపెట్టి ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సూర్యకు తోడు ఇషాన్ కిషన్ కూడా చెలరేగడంతో భారత్ 9.1 ఓవర్లలో 100 పరుగుల మార్కును చేరుకుంది. 17.4 ఓవర్లలో 194/5తో నిలిచిన టీమిండియా.. 19.5 ఓవర్లలో రింకూ సింగ్ మెరుపులతో విజయాన్ని అందుకుంది.
Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook