'కోహ్లి' ప్రపంచంలోనే ఓ చెత్త రివ్యూయర్: మైకేల్‌ వాన్‌

'కోహ్లి' అంత చెత్త రివ్యూయర్ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు!

Last Updated : Sep 10, 2018, 02:09 PM IST
'కోహ్లి' ప్రపంచంలోనే ఓ చెత్త రివ్యూయర్: మైకేల్‌ వాన్‌

భారత జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రపంచంలోనే ఓ చెత్త సమీక్షకుడు అని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ అభిప్రాయపడ్డాడు. భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న చివరి టెస్ట్‌ నేపథ్యంలో వాన్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి ఉపయోగించిన రెండు డీఆర్‌ఎస్‌(డిసిషన్‌ రివ్యూ సిస్టమ్‌)లలో  ఫలితం ప్రతికూలంగానే వచ్చింది. దీంతో  మైకేల్‌ వాన్‌  ‘విరాట్‌ ప్రపంచంలోనే విరాట్ ఓ గొప్ప బ్యాట్స్‌మన్‌. కానీ వాస్తవేమేంటంటే ప్రపంచంలోనే ఓ చెత్త రివ్యూయర్‌ కూడా అతనే’ అని ట్వీట్‌ చేశాడు.

రెండో ఇన్నింగ్స్‌లో జడేజా వేసిన 10వ ఓవర్‌ రెండో బంతి ఇంగ్లండ్ ఓపెనర్‌ జెన్నింగ్స్‌ ప్యాడ్స్‌కు తగిలింది. దీంతో వెంటనే సమీక్ష కోరిన కోహ్లికి నిరాశ ఎదురైంది. మళ్లీ 12వ ఓవర్‌లో జడేజా వేసిన బంతి కుక్‌ ప్యాడ్లకు తాకింది. మళ్లీ కోహ్లి రివ్యూ అడిగి భంగపడ్డాడు. దీంతో  మైకేల్‌ వాన్‌ పైవిధంగా స్పదించాడు. కాగా ఆదివారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు రెండు వికెట్లు నష్టపోయి 114 పరుగులు చేసింది.

మరోవైపు ఆసీస్ మాజీ ఆసీస్ క్రికెటర్ గిల్‌క్రిస్ట్‌ విరాట్‌ కోహ్లిపై ప్రశంసలు జల్లుకురిపించాడు. 'నాణ్యమైన బ్యాట్స్‌మెన్లతో పాటు బలమైన బౌలింగ్‌ లైనప్‌ ప్రస్తుత టీమిండియా జట్టు సొంతం. కానీ విదేశాల్లో మ్యాచ్‌లకు వచ్చేసరికి భారత క్రికెట్‌ జట్టు మానసిక స్థైర్యాన్ని కోల్పోతోంది. టీమిండియా విదేశీ సిరీస్‌లలో నెగ్గాలంటే ముందు మానసికంగా ధృడంగా తయారుకావాలి' అని గిల్‌క్రిస్ట్‌ అన్నారు.

Trending News