T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్ 2021(T20 World Cup)లో టీమ్ఇండియానే టైటిల్ ఫేవరేట్ అని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజామామ్ ఉల్ హక్(Inzamam-ul-Haq) అన్నాడు. యూఏఈ(UAE)లోని పరిస్థితులు, టీ20 ఫార్మాట్లో ఆటగాళ్ల అనుభవం, ఇలా ఏ విధంగా చూసిన భారత జట్టు ఛాంపియన్ నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఇంజామామ్ పేర్కొన్నాడు. ‘
ఏ టోర్నీలోనైనా ఫలానా జట్టు కచ్చితంగా విజేతగా నిలుస్తుందని చెప్పలేం. విజయం సాధించడం అనేది ఆ జట్టు అవకాశాలపై ఆధారపడి ఉంటుంది. నా అంచనా ప్రకారం.. ఈ టీ20 ప్రపంచకప్‌లో ఛాంపియన్‌గా నిలిచే అవకాశాలు ఇతర జట్ల కంటే టీమ్ఇండియా(Teamindia)కే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా అక్కడి పరిస్థితులు వారికి అనుకూలంగా ఉన్నాయి. ఆ జట్టుకు అనుభవజ్ఞులైన టీ20 ఆటగాళ్లున్నారు’ అని ఇంజామామ్ అన్నాడు.
Also read: T20 WC 2021: మెంటార్‌గా ధోని పని మెుదలెట్టేశాడు...వీడియో వైరల్
అక్టోబరు 24న భారత్, పాక్(Ind vs Pak) మధ్య హై వోల్టెజీ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు(Cricket Lovers) ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ గురించి ఇంజామామ్ మాట్లాడాడు.‘సూపర్ 12 దశలో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ ఫైనల్‌కు ముందు ఫైనల్‌లాంటిది. ఈ మ్యాచ్‌కు ఉన్నంత క్రేజ్ మరే మ్యాచ్‌కు ఉండదు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2017)లో ఇరు జట్లు తలపడిన రెండు మ్యాచ్‌లు ఫైనల్స్‌ను తలపించాయి’అని ఇంజామామ్ ఉల్ హక్ అన్నాడు.
Also read: India Vs Pakistan Match History: గెట్ రెడీ ఫర్ హై ఓట్లేజ్ మ్యాచ్.. బల్బులు పగలాల్సిందే!
బుధవారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ మాట్లాడుతూ..‘ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమ్ఇండియా హాయిగా ఆడింది. 155 పరుగుల లక్ష్యాన్ని కోహ్లీ సేన పెద్దగా శ్రమించకుండానే ఛేదించింది. టీ20ల్లో ఇలాంటి పిచ్‌లపై టీమ్ఇండియా అత్యంత ప్రమాదకరమైన జట్టు’అని వివరించాడు. మరోవైపు, తన మొదటి వార్మప్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ని ఓడించి పాకిస్థాన్.. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాక్(Pakistan)కు ఇది గట్టిదెబ్బగానే చెప్పవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook