India Vs Pakistan in T20 World Cup 2021: దుబాయ్ వేదికగా జరగున్న టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2021) లో అక్టోబర్ 24న ఇండియా - పాకిస్తాన్ (India Vs Pakistan) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం రెండు దాయాది దేశ ప్రజలే కాదు ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. ఏ జట్ల మధ్య మ్యాచ్ జరిగితే.. ప్రపంచం మొత్తం టీవీలకు అతుక్కుపోతుందో ఆ మ్యాచ్ రానే వచ్చింది.
భారత్ - పాకిస్తాన్ (India-Pakistan) జట్లు వేరే ఏ దేశాలతో మ్యాచ్ ఆడిన గెలుపు ఓటముల గురించి అంత పెద్దగా ఆసక్తి కనబరచరు కానీ.. ఈ రెండు దేశాల మధ్య మాత్రం మ్యాచ్ జరిగితే... గెలుపు కోసమే ఇరు జట్లు ప్రాణం పెట్టి ఆడతాయి. ఒకవేళ ఓడిపోతే దేశం ముందు తలదించుకోవాల్సి వస్తుందనే భావనలో ఆటగాళ్లు ఆడతారు.
Also Read: Pawan Kalyan & Rana Daggubati Photo: ఒకరు భీమ్లా నాయక్.. మరొకరు డేనియల్ శేఖర్.. తగ్గేదేలే!
చివరగా భారత్- పాకిస్తాన్ జట్లు న్యూజిలాండ్‌లో (New Zealand) జరిగిన వరల్డ్ కప్‌లో (World Cup 2019) భాగంగా జూన్ 16 2019 లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ 89 రన్స్ తేడాతో పాకిస్తాన్ జట్టుపై గెలిచింది. దాదాపు రెండేళ్లుగా ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగకపోవటం.. ఈ సారి తలపడటం... అది కూడా పొట్టి ప్రపంచకప్ (T20 World Cup)లో దాయాది దేశాల మధ్య సమరం జరగటం.. క్రికెట్ అభిమానులకు పండగే అని చెప్పాలి.
T20 వరల్డ్ కప్ లో భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 24 అంటే ఆదివారం రోజున జరగనుంది. ఇరు జట్ల మధ్య జరగనున్న హై ఓట్లేజ్ మ్యాచ్ (High Voltage Match) కు క్రీడా అభిమానులు "క్రికెట్ సూపర్ సండే" (Cricket Super Sunday) అని పేరు కూడా పెట్టుకున్నారు.
Also Read: Epsilon Variant Found in Pakistan: పాకిస్తాన్‌లో ప్రమాద ఘంటికలు.. బయటపడ్డ 7 కొత్త మ్యూటేషన్లు
హిస్టరీ పరంగా చూస్తే.. ఇప్పటి వరకు ఇండియా - పాకిస్తాన్ జట్లు ఏడూ సార్లు ప్రపంచకప్‌లో తలపడ్డాయి.. వీటిలో 5 మ్యాచ్‌లు టీ20 వరల్డ్ కప్ లు కాగా.. నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందగా.. ఒక మ్యాచ్ రద్దు అయింది. ప్రపంచకప్‌లో ఏడూ సార్లు తడబడిన అన్ని మ్యాచుల్లో భారత్‌దే పై చేయిగా నిలిచింది.. ఈ సారి ఎలా అయిన హిస్టరీని తిరగ రాయలని పాకిస్తాన్ జట్టు వ్యూహాలు రచిస్తుంటే.. భారత్ మాత్రం ఈ సారి కూడా ఆధిపత్యం మాదే అంటూ దీమాగా ఉంది.
మరో విషయం ఏమిటంటే.... అక్టోబర్ 24న దుబాయ్ లో జరగబోయే ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ టికెట్లను అక్టోబర్ 4వ తేదీన అందుబాటులో ఉంచగా.. గంటలోనే టికెట్లన్నీ అమ్ముడుపోయాయంటేనే అర్థం చేసుకోండి.. ఈ మ్యాచ్ ఎంత హై ఓల్టేజ్ లో ఉండబోతుందో..!!
Also Read: India Crosses 1 Billion Vaccination: భళా 'భారత్'.. 100 కోట్ల టీకాల పంపిణీ పూర్తి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook