India vs Sri Lanka Highlights: ఆసియా క్రీడల్లో టీమిండియా చరిత్ర సృష్టించింది. మహిళల క్రికెట్ ఫైనల్లో 19 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి స్వర్ణం సాధించింది. దీంతో భారత్ ఖాతాలో రెండో స్వర్ణం చేరింది. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌లు అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించారు. బౌలింగ్‌లో టైటాస్ సాధు, రాజేశ్వరి గైక్వాడ్ రాణించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక 97 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమిండియా 19 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది.
భారత్ తరుఫున బ్యాటింగ్‌లో ఓపెనర్లు స్మృతి మంధాన (46), జెమీమా రోడ్రిగ్స్ (42) మాత్రమే రాణించారు. వీరిద్దరూ తప్ప ఏ బ్యాట్స్‌మెన్ కూడా ఎక్కువసేపు మైదానంలో ఉండలేకపోయారు. షఫాలీ వర్మ (9), రీచా ఘోష్ (9), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (2), పూజా వస్త్రాకర్ (2) విఫలమయ్యారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంక.. భారత బౌలర్ల ధాటికి విలవిల్లాడింది. హాసిని పెరీరా (25), డిసిల్వా (23)జట్టుకు భాగస్వామ్యం అందించినా.. శ్రీలంక సద్వినియోగం చేసుకోలేకపోయింది. రణసింగ్ (19) పర్వాలేదనిపించింది. భారత బౌలర్లలో టిటాస్ సాధు మూడు వికెట్లతో చెలరేగగా.. రాజేశ్వరి గైక్వాడ్ రెండు, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, దేవిక వైద్య చెరో వికెట్ తీశారు.
పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జట్టు ప్రపంచ రికార్డు సృష్టించిన తర్వాత.. ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది రెండో బంగారు పతకం. మొత్తం పతకాల సంఖ్య 11కి చేరింది. ఆసియా క్రీడల్లో భారత్ తొలిసారిగా క్రికెట్ ఈవెంట్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. 2010, 2014లో గతంలో జరిగిన రెండుసార్లు పాకిస్థాన్ స్వర్ణ పతకాన్ని సాధించింది.
భారత్ స్వర్ణం సాధించడంపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. "మా క్రికెట్ జట్టు ఆసియా క్రీడల్లో మహిళల క్రికెట్ స్వర్ణం సాధించడం ఎంత గొప్ప ప్రదర్శన. దేశం వారి అద్భుతమైన విజయాన్ని చూసి ఆనందిస్తోంది. మన బిడ్డలు తమ ప్రతిభ, నైపుణ్యం, సమష్టి కృషితో క్రీడా రంగంలో కూడా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నారు. గొప్ప విజయం సాధించినందుకు అభినందనలు " అని ప్రధాని మోదీ తెలిపారు.
Also Read: Suryakumar Yadav: ఇదేం బాదుడు సూర్య భాయ్.. వరుసగా నాలుగు సిక్సర్లతో ఆ బౌలర్‌కు చుక్కలు
Also Read: Jio AirFiber: జియో ఎయిర్ ఫైబర్ లాంచ్, ఇంటర్నెట్ స్పీడ్, ఫ్రీ ఓటీటీ ఇతర ప్లాన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి