Fastest Century Record: క్రికెట్ ఆడే దేశాల్లో చాలావరకూ భారతీయ మూలాలున్న క్రికెటర్లు స్థానం సంపాదించుకుంటున్నారు. అలాగే భారతీయ మూలాలు కలిగిన ఓ క్రికెటర్ పెను సంచలనం నమోదు చేశాడు. రికార్డు స్థాయిలో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు.
ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒకదాన్ని మించి మరో రికార్డు నమోదవుతుంటుంది. ఫాస్టెస్ట్ సెంచరీ లేదా హాఫ్ సెంచరీ, గ్రేట్ క్యాచ్, హ్యాట్రిక్, ఓవర్‌లో ఆరు సిక్సర్లు ఇలా పలు అంశాల్లో రికార్డులు సాధారణమే. అదే విధంగా ఓ క్రికెటర్ టీ10 లీగ్‌లో ఎవరూ ఊహించని బ్యాటింగ్ ప్రదర్శించాడు. మెరుపువేగంతో సెంచరీ సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు బ్రేక్ చేయడం ఇప్పట్లో అసాధ్యమే కావచ్చు. ఎందుకంటే టోర్నమెంట్ జరిగిందే పది ఓవర్లకు. అంటే కేవలం 60 బంతులకు. ఇందులో 33 బంతుల్లో సెంచరీ సాధించడమంటే మాటలా మరి..ఇంతకీ ఈ క్రికెటర్ భారతీయుడు కాదు కానీ భారతీయ మూలాలున్న క్రికెటర్.
ఇతడి పేరు తరణ్‌జీత్ సింగ్. అద్భుతమైన బ్యాటింగ్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 33 బంతుల్లో సెంచరీ పూర్తి చేసేశాడు. అతని స్ట్రైక్ రేట్ 322 అంటే ఎంత వేగంగా ఆడాడో అర్ధం చేసుకోవచ్చు. యూరోపియన్ క్రికెట్ సిరీస్‌లో చోటుచేసుకున్న పరిణామమిది.
తరణ్‌జిత్ సింహ్ యూరోపియన్ క్రికెట్ సిరీస్ టీ10 టోర్నీలో రొమేనియా తరపున ఆడాడు. బ్యాట్‌తో ఓ విధ్వంసమే సృష్టించాడని చెప్పవచ్చు. భారీ భారీ సిక్సర్లతో హల్‌చల్ చేశాడు. యూరోపియన్ క్రికెట్ సిరీస్ టీ10 లీగ్‌లో 33 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 40 బంతులు ఆడి 129 పరుగులు చేశాడు. ఇందులో 14 సిక్సర్లు, 9 ఫోర్లు ఉండటం విశేషం. 9వ ఓవర్‌లో వరుసగా 5 సిక్సర్లు బాదడం మరో ప్రత్యేకత.
రొమేనియా ఓపెనర్‌గా బరిలో దిగిన తరణ్‌జీత్ సింహ్ వస్తూనే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తరణ్‌జీత్ సింహ్ అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 186 పరుగులు సాధించింది రొమేనియా. 187 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బుకారెస్ట్ సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 90 పరుగులే చేయగలిగింది. 96 పరుగుల తేడాతో మ్యాచ్ ఓడిపోయింది.
రొమేనియా జట్టు విధ్వంసకర బ్యాటర్ 37 ఏళ్ల తరణ్‌జీత్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 19 టీ20 మ్యాచ్‌లు ఆడి 1 సెంచరీ, 5 హాఫ్ సెంచరీలతో 704 పరుగులు చేశాడు. ఇతడి మరో ప్రత్యేకత బౌలర్ కూడా కావడం. ఆఫ్ స్పిన్ అద్భుతంగా వేస్తాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకూ 26 వికెట్లు సాధించాడు.
Also read: ICC Test Rankings: అగ్రస్థానంలోకి రూట్.. పడిపోయిన కోహ్లీ.. అశ్విన్, జడేజా ప్లేస్ సేఫ్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook