ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు బీసీసీఐ హెచ్చరిక

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టుకు బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్(ఏసీయూ) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

Last Updated : May 23, 2018, 10:08 AM IST
ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు బీసీసీఐ హెచ్చరిక

ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టుకు బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్(ఏసీయూ) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ ప్రాంచైజీ తమ ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బందికి గురుగ్రామ్‌లోని ఓ గోల్ఫ్‌ సెంటర్‌లో విందు ఏర్పాటు చేసింది. ఈ పార్టీలో ఢిల్లీ జట్టు చీర్‌గాళ్స్‌ కూడా పాల్గొన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఏసీయూ అధికారులు ఐపీఎల్‌ చీర్‌ లీడర్లను ఆహ్వానించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

 

ఫిక్సింగ్ నేపథ్యంలో పార్టీలకు ఛీర్‌గాల్స్‌ను తీసుకురావడాన్ని ఏసీయూ కోడ్ అనుమతించదని తెలిపింది. బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ (ఏసీయూ) నిబంధనల ప్రకారం చీర్‌గాళ్స్‌.. జట్టుకు సంబంధించిన ఎలాంటి ప్రైవేట్‌ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఢిల్లీ మేనేజ్ మెంట్ ని ఆదేశించింది.  కాగా, దీనిపై బీసీసీఐకి ఎలాంటి ఫిర్యాదు చేయకపోయినా, ఐపీఎల్ లీగ్‌ ముగిశాక బోర్డుకు ఇచ్చే నివేదికలో ఈ సంఘటనను పెర్కొంటామని ఏసీయూ అధికారి ఒకరు చెప్పారు.

Trending News