CSK batsman Ruturaj Gaikwad tested Covid-19: ఐపీఎల్ 2020 ప్రారంభానికి ముందు కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టును అతలాకుతలం చేస్తోంది. ఐపీఎల్ కోసం దుబాయ్ చేరుకున్న ఆ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టులో ఇప్పటికే పేస్ బౌలర్ దీపక్ చాహర్ తోపాటు పది మంది వరకు కరోనా బారిన పడగా.. తాజగా సురేష్ రైనా సైతం టోర్నీ నుంచి వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడు. ఈ క్రమంలోనే సీఎస్‌కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ( Ruturaj Gaikwad ) సైతం కరోనా బారిన పడ్డాడు. దీంతో సీఎస్‌కే ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. Also read: Suresh Raina: ఐపీఎల్ టోర్నీ నుంచి తప్పుకున్న రైనా
ఇదిలాఉంటే.. అందరికంటే ముందు ప్రాక్టీస్ మొదలుపెట్టాలని దుబాయ్ చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులో కనీసం 10 మంది సభ్యులు ఐసోలేషన్‌లో ఉన్నారు. బీసీసీఐ ఎస్‌ఓపీ ప్రకారం కరోనా వైరస్ సోకిన వాళ్లు 14 రోజులు ఐసోలేషన్‌లో ఉండాలి. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ధోనీసేన ఆలస్యంగా ప్రాక్టీస్ మొదలుపెట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. Also read: IPL 2020: చెన్నై సూపర్ కింగ్స్ కు తాకిన కరోనా వైరస్
Apsara Rani: స్విమ్ డ్రెస్‌లో రెచ్చిపోయిన అప్సర Also read: Seerat Kapoor: పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు