CSK vs SRH: అదరగొట్టిన అభిషేక్ శర్మ.. ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ బోణీ! చెన్నైకి వరుసగా నాలుగో ఓటమి!

SunRisers Hyderabad beat Chennai Super Kings. ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బోణీ కొట్టింది. డీవై పాటిల్‌ స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తో జరిగిన మ్యాచులో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 9, 2022, 07:47 PM IST
  • చెలరేగిన అభిషేక్ శర్మ
  • ఐపీఎల్ 2022లో తొలి విజయం అందుకున్న సన్‌రైజర్స్‌
  • చెన్నైకి వరుసగా నాలుగో ఓటమి
 CSK vs SRH: అదరగొట్టిన అభిషేక్ శర్మ.. ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ బోణీ! చెన్నైకి వరుసగా నాలుగో ఓటమి!

Abhishek Sharma Half Century helps SunRisers Hyderabad beat Chennai Super Kings: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బోణీ కొట్టింది. శనివారం సాయంత్రం డీవై పాటిల్‌ స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. హైదరాబాద్ బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్‌ శర్మ (75 : 49 బంతుల్లో 5×4, 3×6) అర్ధ శతకంతో సత్తాచాటాడు. రూ. 6.5 కోట్లు పెట్టి కొన్నందుకు ఎట్టకేలకు అతడు మెరిశాడు. ఇక కెప్టెన్‌ కేన్ విలియమ్సన్‌ (32), స్టార్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠీ (39 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చెన్నై బౌలర్లలో డ్వేన్ బ్రావో, ముఖేష్ చౌదరీ చెరో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో సన్‌రైజర్స్‌ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 

ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగుల సాధారణ స్కోర్  చేసింది. మోయిన్ అలీ (48; 35 బంతుల్లో 3x4, 2x6) తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. తెలుగు తేజం అంబటి రాయుడు (27; 27 బంతుల్లో 4 x4), కెప్టెన్ రవీంద్ర జడేజా (23; 15 బంతుల్లో 2x4, 1x6) పర్వాలేదనిపించారు. ఎంఎస్ ధోనీ (3), శివమ్ దూబే (3) విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, నటరాజన్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆరంభంలో నిదానంగా ఆడిన ఈ జోడీ.. క్రీజులో కుదురుకున్నాక బ్యాట్ జులిపించారు. చెన్నై బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేశారు. ఆపై చెత్త బంతులను బౌండరీలకు తరలిస్తూ స్కోర్ బోర్డును పరుగెత్తించారు. ఈ క్రమంలోనే 12వ ఓవర్ నాలుగో బంతికి అభిషేక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ 2022 వేలంలో రూ. 6.5 కోట్లు పెట్టి కొన్నందుకు ఎట్టకేలకు అతడు న్యాయం చేశాడు.

ధాటిగా ఆడే క్రమంలో 13వ ఓవర్‌లో కేన్ విలియమ్సన్ క్యాచ్ ఔటయ్యాడు. దాంతో 89 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠి కూడా రాగానే బౌండరీ బాది మంచి ఊపులో ఉన్నాడు. క్యాచ్ ఔట్ నుంచి తప్ప్పించుకున్న అభిషేక్ శర్మ.. కొదిసేపటికే క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ఆపై క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ ఓ బౌండరీ బాదగా..  త్రిపాఠి మరొకటి బాది విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఐపీఎల్ 2022 టోర్నీలో చెన్నైకు వరుసగా ఇది నాలుగో ఓటమి కాగా.. సన్‌రైజర్స్‌కు తొలి విజయం కావడం గమనార్హం.

Also Read: Umran Malik: బుల్లెట్‌ బంతి వేసిన సన్‌రైజర్స్‌ బౌలర్.. ఐపీఎల్ 2022లో ఇదే ఫాస్టెస్ట్ డెలివరీ!

Also Read: Governor Tamilsai: తెలంగాణ గవర్నర్‌ను అనకూడని మాటన్న నెటిజన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News