Dhoni Gambhir: మ్యాచ్ అనంతరం ఎంఎస్ ధోనీని కలిసిన గౌతమ్ గంభీర్‌.. ఏం మాట్లాడుకున్నారో!!

MS Dhoni-Gautam Gambhir's Meet Up. లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటార్‌, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్‌ గంభీర్‌ తన మాజీ సారథి ఎంఎస్ ధోనీ దగ్గరికి వచ్చి మాట్లాడాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 1, 2022, 12:27 PM IST
  • ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం
  • ఎంఎస్ ధోనీని కలిసిన గౌతమ్ గంభీర్‌
  • ఏం మాట్లాడుకున్నారో
Dhoni Gambhir: మ్యాచ్ అనంతరం ఎంఎస్ ధోనీని కలిసిన గౌతమ్ గంభీర్‌.. ఏం మాట్లాడుకున్నారో!!

Gautam Gambhir meets his skipper MS Dhoni after LSG beat CSK: గురువారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రాబిన్ ఊతప్ప (50), శివమ్‌ దూబే (49) చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 210 పరుగులు చేసింది. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నాలుగు వికెట్లు కోల్పోయి మరో మూడు బంతులు ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. లక్నో బ్యాటర్ ఎవిన్ లూయిస్‌ (55) ఇన్నింగ్స్ చివరలో ఆకాశమే హద్దుగా చెలరేగి ఊహించని విజయాన్ని అందించాడు. 

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓటమి అనంతరం టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ డగౌట్ వెళుతూ.. లక్నో సూపర్‌ జెయింట్స్‌ పేసర్ అవేశ్ ఖాన్‌తో మాట్లాడాడు. ఈ సమయంలో లక్నో మెంటార్‌, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్‌ గంభీర్‌ తన మాజీ సారథి ధోనీ దగ్గరికి వచ్చి మాట్లాడాడు. ఇద్దరు కలిసి చాలా సమయం ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దాంతో ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏం మాట్లాడుకున్నారో అని కామెంట్లు చేస్తున్నారు. 

ఎంఎస్ ధోనీని కలిసిన ఫొటోలను గౌతమ్‌ గంభీర్‌ అభిమానులతో పంచుకున్నాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పోస్ట్ చేసి.. 'నా కెప్టెన్‌ను కలవడం సంతోషంగా ఉంది' అని పేర్కొన్నారు. గంభీర్‌, ధోనీలు టీమిండియాకు కలిసి ఆడిన విషయం తెలిసిందే. మహీ కెప్టెన్సీలో గౌతీ మ్యాచులు ఆడాడు. ఇద్దరు కలిసి టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలు అందించారు. ముఖ్యంగా 2011 వన్డే ప్రపంచకప్‌లో వీరిద్దరూ చెలరేగడంతో భారత్‌ చారిత్రక విజయం సాధించింది. 

ఇక ఐపీఎల్ టోర్నీలో కూడా కోల్‌కతా కెప్టెన్‌గా గౌతమ్ గంభీర్‌, చెన్నై సారథిగా ఎంఎస్ ధోనీ పలుమార్లు మైదానంలో ప్రత్యర్థులుగా తలపడ్డారు. ఎప్పుడూ కూడా వీరు మంచి స్నేహితులుగానే ఉన్నారు. గౌతీ రెండు టైటిల్స్ గెలవగా.. మహీ నాలుగు ట్రోఫీలు సాధించాడు. ఒకానొక దశలో ధోనీ ఐపీఎల్ టోర్నీలో హ్యాట్రిక్‌ విజయాలు సాధించకుండా అడ్డుకుంది గంభీరే. 2010, 2011లో వరుసగా రెండు సీజన్లు విజేతగా నిలిచిన చెన్నైకి.. 2012 ఫైనల్లో కోల్‌కతా షాకిచ్చింది. 2012లో గంభీర్‌ సారథ్యంలో కోల్‌కతా తొలిసారి ట్రోఫీ కైవసం చేసుకుంది. ఇక 2014లో మరోసారి టైటిల్‌ విజేతగా నిలిచింది. 

Also Read: IPL 2022 Spectators: ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఇక క్రికెట్ ఫ్యాన్స్ కు పండగే!

Also Read: Rana Daggubati: మీరు తల్లి కాబోతున్నారా?.. 'భీమ్లా నాయక్' హీరో సతీమణి ఏం చెప్పారంటే!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News