IPL 2022: ఐపీఎల్-2022లో తొలి మ్యాచ్‌లోనే ముంబైకి ఓటమి ఎదురైంది. ఇక తదుపరి మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. రేపు ముంబైలోని డివై పాటిల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సత్తా చాటాలని టీమ్ భావిస్తోంది. ఈక్రమంలో ఆ జట్టుకు గుడ్ న్యూస్ అందింది. గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన ఆ జట్టు స్టార్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ అందుబాటులోకి వచ్చాడు. రాజస్థాన్ మ్యాచ్‌లో అతడు ఆడనున్నాడు.
గాయం నుంచి కోలుకున్న సూర్యకుమార్ తొలి మ్యాచ్‌లోనే ఆడాల్సి ఉంది. ఐతే పూర్తి ఫిట్ నెస్ సాధించకపోవడంతో ఢిల్లీ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఐతే ప్రస్తుతం అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. దీంతో సూర్య జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అతడు వస్తే టాప్ ఆర్డర్‌లో ముంబై ప్రతిష్టంగా మారనుంది. తన బ్యాటింగ్‌తో ఇప్పటికే టీమ్‌కు ఎన్నో విజయాలు అందించాడు. ఇటీవల ఢిల్లీతో జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై జట్టు ఓటమి పాలైంది. రాజస్థాన్ మ్యాచ్ తర్వాత ఈ నెల 9న బెంగళూరుతో ముంబై తలపడనుంది.
ముంబై ఇండియన్స్ టీం: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, అన్మోల్ ప్రీత్ సింగ్, రాహుల్ బుద్ధి, రమణదీప్ సింగ్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టీమ్ డేవిడ్, అర్జున్ టెండూల్కర్, బాసిల్ థంపి, హృతిక్ షోకీన్, బుమ్రా, ఉనద్కత్, ఆర్చర్, మయాంక్ మార్కండే, మురుగన్ అశ్విన్, రిలే మెరెడిత్, టైమల్ మిల్స్, అర్షద్ ఖాన్, డేనియల్ సామ్స్, డెవాల్డ్ బ్రెవిస్, ఫాబియన్ అలెన్, కీరన్ పొలార్డ్, సంజయ్ యాదవ్, ఆర్యన్ జుయల్.
Also Read: Ugadi 2022: కరోనా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగుస్తుందా.. కొత్త పంచాంగం ఏం చెబుతోంది
Also read: Chaitra Amavasya 2022: రాబోయే చైత్ర అమావాస్యకు ఈ దోషాలను నివారించుకుంటే మేలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook