IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 15వ ఎడిషన్ ప్రస్తుతం తుది అంకానికి చేరుకుంది. ఆదివారం పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ తో లీగ్ దశ ముగిసింది. ఇప్పుడు టోర్నీ నాకౌట్ దశ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. మంగళవారం (మే 24), బుధవారం (మే 25), శుక్రవారం (మే 27) ప్లేఆఫ్ మ్యాచ్ లు జరగునున్నాయి. మే 24న క్వాలిఫయర్స్ జరగనుండగా.. మే 25న ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది.
అయితే ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిచి జట్టు, క్వాలిఫయర్స్ మ్యాచ్ లో ఓడిన జట్టుతో మే 27న తలపడాల్సి ఉంది. ఇందులో గెలిచిన జట్టు మే 29న ఫైనల్ ఆడనుంది. అయితే ఇప్పటికే లీగ్ దశ ముగియడం వల్ల ఈ సీజన్ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్, వికెట్లు పడగొట్టిన బౌలర్ ఎవరు? ఈసారి ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్ వరించేది ఎవర్నో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ లో అత్యుత్తమ ప్రదర్శనతో అత్యధిక పరుగులు, వికెట్లు పడగొట్టిన క్రికెటర్లకు ఈ క్యాప్స్ ను ఎంపిక చేస్తుంటారు. అయితే ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఒకటి కంటే ఎక్కువసార్లు ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్ సొంతం చేసుకున్న వారెవరో తెలుసుకుందాం.
ఆరెంజ్ క్యాప్..
ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కు ప్రతి సీజన్ లో ఆరెంజ్ క్యాప్ లభిస్తోంది. ఈ క్యాప్ గెలిచిన తొలి ఆటగాడు న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్. అయితే ఐపీఎల్ లో ఒకటి కంటే ఎక్కువ సార్లు ఆరెంజ్ క్యాప్ సాధించిన వారిలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ముందున్నాడు. అతడు 2015, 2017, 2019 సీజన్లలో ఆరెంజ్ క్యాప్ ను దక్కించుకున్నాడు.
పర్పుల్ క్యాప్..
ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన ఉత్తమ బౌలర్ కు ఈ పర్పుల్ క్యాప్ ను అందజేస్తారు. గతేడాది ఐపీఎల్ సీజన్ లో ఒకే ఎడిషన్‌లో అత్యధికంగా 32 వికెట్లు పడగొట్టిన ఘనత హర్షల్ పటేల్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) కు దక్కింది. అంతకుముందు భువనేశ్వర్ కుమార్ (సన్ రైజర్స్ హైదరాబాద్), డ్వేన్ బ్రేవో (చెన్నై సూపర్ కింగ్స్) మాత్రమే రెండుసార్లు పర్పుల్ క్యాప్ గెలుచుకున్నారు. 2016, 2017 వరుస సీజన్లలో 23, 27 వికెట్లు పడగొట్టి వరుసగా రెండు టోర్నమెంట్లలో పర్పుల్ క్యాప్ గెలుచుకున్న ఏకైక ఆటగాడిగా భువనేశ్వర్ కుమార్ నిలిచాడు.
ఐపీఎల్ 2022లో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్ లో ఆదివారంతో లీగ్ దశ ముగిసింది. దీంతో ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్ పోటీలో ముందుంది ఎవరో ఐపీఎల్ మేనేజ్ మెంట్ ప్రకటించింది. ఆరెంజ్ క్యాప్ కు జోస్ బట్లర్ 623 పరుగులతో అగ్రస్థానంలో నిలవగా.. మరోవైపు పర్పుల్ క్యాప్ రేసులో యుజ్వేంద్ర చాహల్ (26 వికెట్లు) ముందున్నాడు. అయితే ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్ రేసులో అగ్రస్థానంలో ఉన్న వారిద్దరూ ఒకే జట్టు (రాజస్థాన్ రాయల్స్) కు చెందిన వారు కావడం విశేషం. అయితే లీగ్ ముగిసే సమయానికి అత్యధిక పరుగులు, వికెట్లు తీసిన వారికి ఈ క్యాప్స్ లభిస్తాయి.
Also Read: Virat Kohli Tweet: ఢిల్లీపై ముంబై విజయం.. వైరల్‌గా మారిన విరాట్ కోహ్లీ ట్వీట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook