IPL 2022: ఐపీఎల్ 2022 పోటీలు రోజురోజుకూ కీలకంగా మారుతున్నాయి. కొన్ని జట్లు అంచనాల్ని మించి ఆడుతుంటే..మరికొన్ని ఘోరంగా విఫలమౌతున్నాయి. కానీ టైటిల్ పోరులో మాత్రం ఆ రెండు జట్లే నిలుస్తాయంటున్నాడు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్.
ఐపీఎల్ల 2022లో సగానికి పైగా మ్యాచ్‌లు ముగిశాయి. ఈసారి ఐపీఎల్‌లో అందరి అంచనాలు తలకిందులవుతున్నాయి. కొత్త జట్లు అద్భుతంగా రాణిస్తుంటే..పాత ఛాంపియన్లు చతికిలపడుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకూ 5 సార్లు టైటిల్ గెల్చుకున్న ఘనత దక్కించుకున్న ముంబై ఇండియన్స్ పరిస్థితి మరీ ఘోరంగా మారింది. వరుసగా 8 మ్యాచ్‌లలో ఓటమితో..ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. మరో ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ అష్టకష్టాలు పడుతోంది.
ఈసారి ఐపీఎల్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు అద్భుతంగా రాణిస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ తిరుగులేని ఆధిక్యంతో పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ సైతం 8 మ్యాచ్‌లు ఆడి 10 పాయింట్లతో నాలుగవ స్థానంలో నిలిచింది. అటు రాజస్థాన్ రాయల్స్ కూడా అద్భుతంగా ప్రదర్శన ఇస్తోంది. పది పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. ఇలా కొన్ని జట్లు అంచనాలకు మించి ఆడుతున్నాయి. ఈ క్రమంలో ఫేవరెట్ జట్లు ఏవనే విషయంపై క్రికెట్ నిపుణులు, మాజీలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టీమ్ ఇండియా మాజీ ఆటగాడు పార్ధివ్ పటేల్ దృష్టిలో మాత్రం గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీలు టైటిల్ బరిలో నిలుస్తాయట. గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటమే కాకుండా..చివరివరకూ అదే కొనసాగిస్తుందని పార్ధివ్ పటేల్ అంటున్నాడు. ఇక ఆర్సీబీ ప్లే ఆఫ్‌కు చేరుకోవడమే కాకుండా..టైటిల్ బరిలో నిలుస్తుందని..విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్‌లో వస్తాడని చెబుతున్నాడు.
Also read: PBKS vs CSK: చివరలో చేతులెత్తేసిన చెన్నై.. పంజాబ్ ఘన విజయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.