RCB vs SRH: 68 పరుగులకే కుప్పకూలిన ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్ వరుసగా ఐదవ విజయం

RCB vs SRH: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సత్తా చాటుతోంది. వరుసగా ఐదవ విజయాన్ని నమోదు చేసింది. బౌలర్లు చెలరేగడంతో ఆర్సీబీ అత్యల్ప స్కోరుకే కుప్పకూలింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 24, 2022, 10:03 AM IST
  • ఐపీఎల్ 2022లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
  • సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ల ధాటికి 68 పరుగులకే కుప్పకూలిన ఆర్సీబీ
  • ఆర్సీబీపై విజయంతో 10 పాయింట్లలో రెండవ స్థానంలో ఎస్ఆర్‌హెచ్
RCB vs SRH: 68 పరుగులకే కుప్పకూలిన ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్ వరుసగా ఐదవ విజయం

RCB vs SRH: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సత్తా చాటుతోంది. వరుసగా ఐదవ విజయాన్ని నమోదు చేసింది. బౌలర్లు చెలరేగడంతో ఆర్సీబీ అత్యల్ప స్కోరుకే కుప్పకూలింది.

ఐపీఎల్ 2022లో శనివారం జరిగిన 36 వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్ల్ బెంగళూరు మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ అత్యంత సులభంగా విజయం సాధించింది. ఆర్సీబీ టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ప్రతి ఒక్క బౌలర్ చెలరేగి స్పెల్  చేశాడు. ఇన్నింగ్స్ రెండవ ఓవర్ నుంచే ఆర్సీబీ వికెట్ల పతనం ప్రారంభమైంది. హైదరాబాద్ బౌలర్ మార్కో జాన్సెన్ ఒకే ఓవర్ లో మూడు వికెట్లు తీయడంతో ఆర్సీబీ కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత నటరాజన్ మూడు వికెట్లు తీసి ఆర్సీబీ నడ్డి విరగ్గొట్టాడు. ఇక సుచిత్ 2 వికెట్లు, ఉమ్రాన్ మాలిక్ అద్భుత బౌలింగ్‌తో 1 వికెట్, భువనేశ్వర్ 1 వికెట్ తీయడంతో ఇక ఆర్సీబీ పరుగులు సాధించలేకపోయింది. అనూహ్యంగా ఆర్సీబీ నుంచి ముగ్గురు డకౌట్ అవడం విశేషం. వెరసి 16.1 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది.

ఇక 69 పరుగుల అతి స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కేవలం 8 ఓవర్లలోనే  ఒక వికెట్ నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ 28 బంతుల్లో 47 పరుగులు చేసి అవుటయ్యాడు. విలియమ్సన్ 10 పరుగులు చేశాడు. ఆర్సీబీపై ఘన విజయంతో పది పాయింట్లు సాధించి..రెండవ స్థానానికి చేరుకుంది ఎస్ఆర్‌హెచ్.

Also read: IPL 2022, KKR vs GT: ఉత్కంఠ పోరులో కోల్​కతాపై​ గుజరాత్​ విజయం..అగ్రస్థానంలోకి హార్దిక్‌ సేన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News