CSK vs GT match- Shubman Gill: చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో ఓటమి నుంచి కోలుకోకముందే గుజరాత్ టైటాన్స్ కు మరో దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కు భారీగా జరిమానా విధించబడింది. బుధవారం చెన్నైతో జరిగిన సీఎస్కేతో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా గిల్ కు రూ. 12 లక్షలు జరిమానా విధించినట్లు ఐపీఎల్ ఓ ప్రకటన తెలిపింది. మినిమమ్ ఓవర్ రేటుకు సంబంధించిన ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం, గిల్ కు ఈ ఫైన్ వేస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ 17వ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా ఎదుర్కొన్న తొలి కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. ఆడిన రెండు మ్యాచుల్లో ఒక మ్యాచ్ గెలిచి.. మరొకటి ఓడిపోయిన గుజరాత్ జట్టు ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.
దారుణంగా విఫలమవుతున్న గిల్..
అయితే జీటీ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత శుభ్ మన్ పరుగుల చేయడంలో దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్‌తో ఆడిన తొలి మ్యాచ్ లో 31 పరుగులు చేసిన గిల్.. నిన్న డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైతో జరిగిన పోరులో కేవలం 8 పరుగులకే ఔటయ్యాడు. గత ఏడాది ఐపీఎల్ లో అయితే గిల్ పరుగల వరద పారించాడు. ఏకంగా ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడంటే అతడి విధ్వంసం స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోండి. 2023 ఐపీఎల్ సీజన్ లో 24 ఏళ్ల గిల్ 17 మ్యాచ్‌లలో 59.33 సగటుతో 890 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, నాలుగు అర్థ సెంచరీలు ఉన్నాయి. క్వాలిఫయర్ 2లో ముంబైపై 60 బంతుల్లోనే 129 పరుగులు చేసి ఔరా అనిపించాడు.
చిత్తు చిత్తుగా ఓడిన గుజరాత్..
మంగళవారం చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో గుజరాత్ జట్టు ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన రుత్ రాజ్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 206 పరుగుల చేసింది. సీఎస్కేలో శివమ్ ధూబే(51), రచిన్ రవీంద్ర(46), రుతురాజ్ గైక్వాడ్(46) అద్భుతంగా జట్టుకు భారీ స్కోరు అందించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ ఆరంభం నుంచే తడబడింది. సుదర్శన్ (37) తప్ప మిగతా అందరూ చేతులెత్తేయడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter