LSG vs PBKS live Score: ఐపీఎల్ 17వ సీజన్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తన రెండో మ్యాచ్ ను పంజాబ్‌తో ఆడుతోంది. లక్నోలోని అటల్ బిహారీ వాచ్ పేయి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్ లో ఇది పదో మ్యాచ్. హోం గౌండ్ లో మ్యాచ్ ఆడుతుండటంతో లక్నోపై భారీగానే అంచనాలు ఉన్నాయి.
ఈసారి లక్నో మేనెజ్ మెంట్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ను కాదని నికొలస్ పూరన్ కు బాధ్యతలు అప్పగించింది. దీంతో ఈ మ్యాచ్ లో రాహుల్ ఇంపాక్ట్ ఫ్లేయర్ గా బరిలోకి దిగనున్నాడు. ఇప్పటి వరకూ ఆడిన ఒక మ్యాచ్ లో లక్నో ఓడిపోగా.. పంజాబ్ ఆడిన రెండింటిలో ఒకదానిలో విజయం సాధించింది. ఐపీఎల్ హిస్టరీలో లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్ టీమ్స్ ఇప్పటి వరకు మూడు మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో రెండు లక్నో గెలవగా.. ఒక మ్యాచ్ లో పంజాబ్ విజయభేరి మోగించింది.
పంజాబ్ కింగ్స్ జట్టు:
శిఖర్ ధావన్(కెప్టెన్), బెయిర్‌స్టో, లివింగ్ స్టోన్, సామ్ కరణ్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, రబాడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు:
కేఎల్ రాహుల్, డికాక్, పడిక్కల్, బదోని, పూరన్(కెప్టెన్/వికెట్ కీపర్), స్టోయినిస్, కృణాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మోసిన్ ఖాన్, మయాంక్ యాదవ్, మణిమారన్ సిద్ధార్థ్.
Also Read: IPL 2024: 'మైదానంలో ఆ ఇద్దరి నటనకు ఆస్కార్ ఇవ్వొచ్చు..': సునీల్ గవాస్కర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి