క్రికెట్ ( Cricket ) అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న ఐపీఎల్ ( IPL Schedule ) తేదీలు ఖరారయ్యాయి. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకూ ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.
ఇండియాలో కరోనా మహమ్మారి సంక్రమణ నేపధ్యంలో యూఏఈ ( UAE ) లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( Indian premier league ) విషయం తెలిసిందే. ఇప్పుడు ఐపీఎల్ తేదీల్ని బీసీసీఐ ఖరారు చేసింది. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకూ ఐపీఎల్ పోటీలు జరగనున్నాయి. సెప్టెంబర్ 19న ఫస్ట్ మ్యాచ్ జరగనుండగా...ఫైనల్ మ్యాచ్ నవంబర్ 10న ఉండబోతోంది. ఆదివారం నాడు జరిగిన బీసీసీఐ ( BCCI ) పాలకమండలి భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అబుదాబి, దుబాయ్, షార్జాలలో 51 రోజుల పాటు జరగనున్న క్రికెట్ మ్యాచ్ లు అభిమానుల్ని అలరించనున్నాయి. స్పాన్సర్ కంపెనీల్లో చైనా కంపెనీల్ని కూడా ఆమోదించడం గమనార్హం. Also read: IPL 2020 FANS: క్రికెట్ అభిమానులకు శుభవార్త
ఐపీఎల్ నిర్వహణలో తీసుకోవల్సిన జాగ్రత్తలు, విధివిధానాలపై మరోసారి చర్చించిన తరువాత నిర్ణయం తీసుకోనున్నారు. ప్రధానంగా క్వారెంటైన్ విధానాలను అనుసరించి బయోబబుల్ శిక్షణా కార్యక్రమాలు, వసతి, ప్రయాణాలపై చర్చ జరగనుంది. Also read: IPL 2020 UAE Facts: క్రికెటర్స్ భద్రత కోసం తీసుకోనున్న చర్యలివే