Virat Kohli Join RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆటగాళ్లందరూ తమ తమ ఫ్రాంఛైజీలు ఏర్పాటు చేసిన శిబిరాల్లో చేరుతున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు శిబిరంలో ఆ టీమ్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు చేరాడు. ఈ సందర్భంగా మాట్లాడిన కోహ్లీ.. ఐపీఎల్ లో ఇన్ని సంవత్సారాలు కొనసాగుతానని తాను అనుకోలేదని అన్నాడు. చాలా రోజుల తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు లేకుండా ఆట స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం వచ్చిందని అన్నాడు.
"ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో నేను ఇన్నేళ్లు ప్రయాణిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కెప్టెన్ గా బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత చాలా స్వేచ్ఛగా ఉంది. పూర్తిస్థాయి బ్యాటర్ గా తిరిగి రాణించాలని అనుకుంటున్నాను. చాలా కాలం తర్వాత ఎలాంటి బాధ్యతలు లేకుండా ఆట స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం దొరికింది. జట్టు కోసం మెరుగ్గా రాణించేందుకు కృషి చేస్తాను" అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ ప్రారంభ సీజన్ 2008లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విరాట్ కోహ్లీని కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2013లో కెప్టెన్ గా టీమ్ బాధ్యతలను తీసుకున్నాడు. 2021 వరకు కెప్టెన్ గా ఆర్సీబీకి విశేషమైన సేవలు చేశాడు. గతేడాది నుంచి కెప్టెన్ గా విరాట్ కోహ్లీ పూర్తిగా తప్పుకున్నాడు. అటు అంతర్జాతీయ క్రికెట్ లోనూ కెప్టెన్సీ బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకున్నాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఇప్పుడు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఫాప్ డుప్లెసిస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అదే వ్యూహంతో డుప్లెసిస్ ను వేలంలో రూ. 7 కోట్లకు ఆ జట్టు కొనుగోలు చేసింది. గతేడాది వరకు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కు ప్రాతినిధ్యం వహించిన డుప్లెసిస్.. ఈ సీజన్ నుంచి ఆర్సీబీ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
Also Read: INDW vs BANW: మహిళల ప్రపంచకప్‌లో భారత్ ఆశలు సెమీస్ సజీవం.. ఆనందంలో మిథాలీ సేన!!
Also Read: IPL 2022: ఐపీఎల్ 2022 టైటిల్ పోరుకు సిద్ధమౌతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ప్రోబబుల్ లెవెన్‌లో ఎవరు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook