Chennai Super Kings Captain vs Sunrisers Hyderabad Playing 11: ఐపీఎల్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో ముందుగా సన్‌రైజర్స్ బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని ధోనీ చెప్పాడు. మరోవైపు సన్‌రైజర్స్ కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు తెలిపాడు.
చెన్నైపై గెలవాలంటే సన్‌రైజర్స్ టాప్ ఆర్డర్ రాణించాల్సిందే. సెంచరీ హీరో హారీ బ్రూక్ గత మ్యాచ్‌లో విఫలమయ్యాడు. రాహుల్ త్రిపాఠి కూడా పేలవ ప్రదర్శన చేశాడు. నేటి మ్యాచ్‌లో ఈ ఇద్దరు చెలరేగితేనే హైదరాబాద్ విజయావకాశాలు మెండుగా ఉంటాయి. బౌలర్లు భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్సత్తాచాటితే చెన్నై బ్యాటర్లను నిలువరించడం సాధ్యం అవుతుంది. చెన్నైపై గెలవాలంటే హైదరాబాద్ కష్టపడక తప్పదు.
తుది జట్లు (CSK vs SRH Playing 11):
చెన్నై: రుతురాజ్ గైక్వాడ్, డేవన్ కాన్వే, అజింక్య రహానే, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్, కీపర్), మహీశ్ తీక్షణ, తుషార్ దేశ్ పాండే, ఆకాశ్ సింగ్, మతీషా పతిరాన.
హైదరాబాద్: హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (కీపర్), అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్‌సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్.
సబ్‌స్టిట్యూట్‌లు:
చెన్నై: అంబటి రాయుడు, షేక్ రషీద్, ఎస్ సేనాపతి, డ్వేన్ ప్రిటోరియస్, ఆర్ హంగార్గేకర్.
హైదరాబాద్: టి నటరాజన్, వివ్రాంత్ శర్మ, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ దగర్, సన్విర్ సింగ్.
Also Read: CSK vs SRH: సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. ఎంఎస్ ధోనీ, అజింక్య రహానేలను ఊరుస్తున్న అరుదైన రికార్డులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.