Virat Kohli Sourav Ganguly Controversy: చేతులు కలిపిన గంగూలీ, విరాట్.. వివాదానికి ముగింపు..!

Sourav Ganguly vs Virat Kohli: ఢిల్లీ, ఆర్‌సీబీ మ్యాచ అనంతరం ఆసక్తికర దృశ్యం కనిపించింది. విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.   

Written by - Ashok Krindinti | Last Updated : May 7, 2023, 11:37 AM IST
Virat Kohli Sourav Ganguly Controversy: చేతులు కలిపిన గంగూలీ, విరాట్.. వివాదానికి ముగింపు..!

Sourav Ganguly vs Virat Kohli: బీసీసీఐ మాజీ చైర్మన్, టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన కెప్టెన్సీ పోయేందుకు గంగూలీనే కారణమని కోహ్లీ ఆగ్రహంతో ఉన్నట్లు ఎన్నో కథనాలు వెలువడ్డాయి. ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ అనంతరం జరిగిన సంఘటన మరింత బలాన్ని చేకూర్చింది. ఇరు జట్ల ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకునే సమయంలో కోహ్లీ వద్దకు గంగూలీ రాగానే.. వెనక్కి వెళ్లిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఒకరికొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసుకున్నారు. అయితే ఈ ఘటన తరువాత ఆసక్తికర దృశ్యం కనిపించింది.

శనివారం ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ అనంతరం మరోసారి ఆ సీన్‌ రీపిట్ అయింది. ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ మ్యాచ్ తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చుకునే క్రమంలో ఒకరికొకరు ఎదురుపడ్డారు. అయితే ఈసారి ఒకరినొకరు చాలా నవ్వుతూ షేక్ ఇచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

వివాదం ఎప్పుడు మొదలైంది..?

సౌరవ్‌ గంగూలీ, విరాట్‌ కోహ్లీల మధ్య గొడవలు ఏడాదిన్నర క్రితం మొదలయ్యాయి. 2021 డిసెంబర్‌లో తొలిసారి ఇద్దరి మధ్య వివాదం తెరపైకి వచ్చింది. సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండగా.. వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పుకునేలా చేశారని ప్రచారం ఉంది. కోహ్లీ ఫామ్ కోల్పోవడం.. టీమిండియా ఒక్క ఐసీసీ టోర్నమెంట్‌ కూడా గెలవకపోవడంతో కోహ్లీ కెప్టెన్సీని వదులుకోవాల్సి వచ్చింది. అయిష్టంగానే కెప్టెన్సీకి గుడ్‌ బై చెప్పిన కోహ్లీ.. అప్పటి నుంచి గంగూలీపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శనివారం రాత్రి జరిగిన ఈ సీన్ తర్వాత వీరిద్దరి మధ్య వివాదం సద్దుమణుగుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నా.. ఏం మాట్లాడుకోలేదు. కనీసం మొఖంపై చిరునవ్వు కూడా లేదు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్‌సీబీపై ఢిల్లీ క్యాపిటిల్స్ జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగుళూరు 181 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ మూడు వికెట్లు కోల్పోయి.. మరో 20 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అందుకుంది. 45 బంతుల్లో 87 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన ఫిల్ సాల్ట్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎన్నికయ్యాడు.

Also Read: Virat Kohli Records: విరాట్ కోహ్లీ మరో రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో తొలి ప్లేయర్‌గా..

Also Read: Assembly Election 2023: ఎన్నికల ఎఫెక్ట్.. ఆ మూడు రోజులు మద్యం దుకాణాలు బంద్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News