IPL 2023: చెన్నై సూపర్‌కింగ్స్ ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 4 టైటిల్స్ గెల్చుకుంది. మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో దుమ్ము రేపుతోంది. చెన్నై సూపర్‌కింగ్స్ జట్టులో ఎక్కువగా 30 వయస్సు పైబడినవాళ్లు లేదా సీనియర్లు ఉంటుంటారు. ఇది ధోని స్ట్రాటెజీ. కానీ ఈసారి ఓ యువకుడిని కొనేందుకు ప్రయత్నించి విఫలమైంది.
మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఐపీఎల్ టీమ్‌గా పేరు పొందిన చెన్నై సూపర్‌కింగ్స్ వేలంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటుంది. ఆటగాళ్లు ఎంపిక, కొనుగోలులో ధోనీ వ్యూహమే వేరు. ఆణిముత్యాల్ని ఏరడంలో ధోనీది ఆరితేరిన చేయి. టార్గెట్ చేసిన ఆటగాడిని కచ్చితంగా కొని తీరుతుంది. అది కూడా అనుకున్న బడ్జెట్‌కు లోబడే. కానీ ఓ కుర్రోడి విషయంలో మాత్రం విఫలమైంది ఆ జట్టు. నెట్స్‌లో టార్చర్ చేసిన ఆ కుర్రోడిని కొనేందుకు ప్రయత్నించి విఫలమైంది చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు. స్వయంగా సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఈ విషయాన్ని వెల్లడించాడు.
ఆ కుర్రోడు మరెవరో కాదు. కోల్‌కతా నైట్‌రైడర్స్ తురుపు మొక్కగా ఉన్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. ఇతడు తమిళనాడుకు చెందిన ఆటగాడు. చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు నెట్స్‌లో చాలాసార్లు బౌలింగ్ చేసేవాడు. బౌలింగ్ సందర్భంగా సీఎస్కే ఆటగాళ్లను తన స్పిన్ మాయాజాలంతో ఇబ్బంది పెట్టేవాడు. అలాంటి బౌలర్‌ను దక్కించుకునేందుకు ఐపీఎల్ 2020 వేలంలో చాలా ప్రయత్నించింది సీఎస్కే. కానీ అప్పటికే పోటీ పడిన కేకేఆర్ 4 కోట్లకు దక్కించుకుంది. ఓ నెట్ బౌలర్‌కు ఇంత భారీ రేటు రావడం విశేషం. అప్పట్లో ఆ ధర ఎక్కువనుకుని సీఎస్కే వరుణ్ చక్రవర్తిని వదిలేసుకుంది. ఆ తరువాత 2022 సీజన్‌లో అదే కేకేఆర్ జట్టు ఏకంగా 8 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఇప్పుడీ సీజన్‌లో 12 కోట్లకు చేరుకున్నాడు. అదీ వరుణ్ చక్రవర్తి సామర్ధ్యం.
వరుణ్ చక్రవర్తి సామర్ధ్యాన్ని పసిగట్టి తగిన వెల చెల్లించడంలో కేకేఆర్ విజయం సాధించింది. అతడి గురించి క్షుణ్ణంగా తెలిసిన సీఎస్కే మాత్రం తక్కువ ధర నిర్ణయించి వదిలేసుకుంది. ఈ విషయంలో ఇప్పటికీ సీఎస్కే బాధపడుతోందట. అంతా తెలిసి కూడా దక్కించుకోలేకపోయినందుకు బాధపడుతున్నామని చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్వయంగా చెప్పడం విశేషం. బౌలింగ్ విభాగంలో ఇప్పుడు కేకేఆర్ జట్టుకు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తిలే ప్రధాన బలం.
Also read: PBKS vs RR highlights: ప్లేఆఫ్స్ రేసులో రాజస్థాన్.. ఇంటికి పంజాబ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook