ఇంగ్లండ్‌ సిరీస్‌కు బుమ్రా, సుందర్‌ దూరం

ఇంగ్లండ్‌తో జులై 3 మంగళవారం నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు పేసర్ జస్పీత్‌ బుమ్రా, ఆఫ్‌ స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ దూరమయ్యారు.

Last Updated : Jul 1, 2018, 10:50 AM IST
ఇంగ్లండ్‌ సిరీస్‌కు బుమ్రా, సుందర్‌ దూరం

ఇంగ్లండ్‌తో జులై 3 మంగళవారం నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌కు పేసర్ జస్పీత్‌ బుమ్రా, ఆఫ్‌ స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ దూరమయ్యారు. బుధవారం ఇర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో బుమ్రా ఫీల్డింగ్‌ సమయంలో చేతికి గాయం అయ్యింది. గాయం కారణంగా గురువారం నెట్‌ ప్రాక్టీసులో కూడా పాల్గొనలేదు. దీంతో బుమ్రా ఐర్లండ్‌తో రెండో టీ20 మ్యాచ్‌కు దూరమయ్యాడు.

స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ కూడా కుడికాలి మడమ గాయంతో టీ20 సిరీస్‌కు దూరం కానున్నాడు. వీరి స్థానంలో శార్ధూల్‌ ఠాకూర్‌, దీపక్‌ ఠాకూర్ పేర్లను బీసీసీఐ ప్రకటించింది. అయితే జూలై 12న ప్రారంభకానున్న ఇంగ్లండ్‌-భారత్‌ మ్యాచుల వన్డే సిరీస్‌ నాటికి బుమ్రా గాయం నుంచి కోలుకునే అవకాశముంది.

Trending News