KKR Vs SRH Dream11 Team Tips: కేకేఆర్‌తో ఎస్‌ఆర్‌హెచ్ ఆఖరి ఫైట్.. గెలుపు ఎవరిది..? డ్రీమ్11 టిప్స్ మీ కోసం..

Kolkata Knight Riders Vs Sunrisers Hyderabad Playing XI Dream11 Team Tips: ఐపీఎల్ 2024 ట్రోఫీ కోసం కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్ నేడు తలపడనున్నాయి. చెన్నైలోని ఎం.చిదంబరం స్టేడియంలో ఫైనల్ పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : May 26, 2024, 01:06 PM IST
KKR Vs SRH Dream11 Team Tips: కేకేఆర్‌తో ఎస్‌ఆర్‌హెచ్ ఆఖరి ఫైట్.. గెలుపు ఎవరిది..? డ్రీమ్11 టిప్స్ మీ కోసం..

Kolkata Knight Riders Vs Sunrisers Hyderabad Playing XI Dream11 Team Tips: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2024లో ఆఖరి ఫైట్‌కు రంగం సిద్ధమైంది. కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఫైనల్ పోరులో తలపడనున్నాయి. క్వాలిఫయర్‌-1లో ఎస్‌ఆర్‌హెచ్‌ను ఓడించి కేకేఆర్ ఫైనల్‌కు చేరుకోగా.. క్వాలిఫయర్‌-2లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి సన్‌రైజర్స్ ఫైనల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. టేబుల్ టాపర్‌గా వరుస విజయాలతో ఫైనల్‌లోకి వచ్చిన కోల్‌కతా.. చివరి మ్యాచ్‌లోనూ అదే జోరు కంటిన్యూ చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి కప్‌ ముద్దాడడంతోపాటు క్వాలిఫయర్-1లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఎస్‌ఆర్‌హెచ్ చూస్తోంది. చెన్నైలోని ఎం.చిదంబరం స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. రెండు జట్లు సమతూకంతో ఉండడంతో బిగ్ ఫైట్ జరగనుంది. హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయి..? పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది..? ప్లేయింగ్‌ 11లో ఎవరు ఉంటారు..? డ్రీమ్‌11 టీమ్‌ (KKR Vs SRH Dream11 Team Tips)ను ఎలా ఎంచుకోవాలి..? పూర్తి వివరాలు ఇలా..

Also Read: IPL 2024 Closing Ceremony: అమెరికా రాక్ బ్రాండ్ ఇమేజిన్ డ్రాగన్స్‌తో ఐపీఎల్ 2024 ముగింపు వేడుకలు
 
హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికి వస్తే.. ఎస్‌ఆర్‌హెచ్, కేకేఆర్ జట్లు మొత్తం 26 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. కోల్‌కతా 17 మ్యాచ్‌లలో విజయం సాధించగా.. సన్‌రైజర్స్ తొమ్మిదింటిలో గెలుపొందింది. చెన్నై పిచ్‌ విషయానికి వస్తే.. ఆరంభంలో బ్యాటింగ్‌కు అనుకూలంగా అనిపించినా.. మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ బౌలింగ్‌క అనుకూలిస్తుంది. ముఖ్యంగా స్పిన్నర్లు పండగ చేసుకుంటారు. మొదట బ్యాటింగ్ చేసిన జట్టుకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సీజన్‌లో జరిగిన 8 మ్యాచ్‌ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఐదుసార్లు గెలుపొందాయి. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఈ పిచ్‌పై మొదటి ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరు 177 కాగా.. రెండో ఇన్నింగ్స్ సగటు స్కోరు 156గా ఉంది. గూగుల్ విన్ ప్రాబబిలిటీ ప్రకారం.. ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌కు విజయ అవకాశాలు 53 శాతం ఉన్నాయి. 

తుది జట్లు ఇలా.. (అంచనా)

సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్ రెడ్డి, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, టి.నటరాజన్, జయదేవ్ ఉనద్కత్

కోల్‌కతా నైట్‌రైడర్స్: సునీల్ నరైన్, గుర్బాజ్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకూ సింగ్, రసెల్, రమణదీప్, స్టార్క్, హర్షిత్, వరుణ్ చక్రవర్తి 

KKR Vs SRH Dream11 Final Prediction:

వికెట్ కీపర్: హెన్రిచ్ క్లాసెన్ 

బ్యాటర్లు: ట్రావిస్ హెడ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్

ఆల్ రౌండర్లు: నితీష్ కుమార్ రెడ్డి, సునీల్ నరైన్ (వైస్ కెప్టెన్), షాబాజ్ అహ్మద్

బౌలర్లు: మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్, వరుణ్ చక్రవర్తి

Also Read: Realme Narzo N55 Price Cut: చెప్పుల ధరకే 64MP AI కెమెరా  Realme Narzo N55 పొందండి.. డిస్కౌంట్‌ పూర్తి వివరాలు!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News