చెన్నై: IPL-2020, 13వ సీజన్ కేవలం ఇంకా మూడు వారాల దూరంలో ఉంది. కాగా సీజన్ కు ముందే 6, 6, 6, 6, 6 గణాంకాలతో ఎం ఎస్ ధోని సంచలన మెరుపులు మెరిపించాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని తిరిగి రావాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ గణాంకాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. గత సంవత్సరంలో సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన తరువాత ఎం ఎస్ ధోని క్రికెట్ నుండి దూరంగా ఉన్నాడు. కాగా ధోని ఇప్పటికే చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలోని నెట్స్‌లో శిక్షణ ప్రారంభించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)13 వ సీజన్ కంటే ముందు ధోని మార్చి 2 నుండి ఇతర ఆటగాళ్లతో కలిసి చెన్నైలో తన శిక్షణను ప్రారంభించాడు. గత కొన్ని నెలలుగా ఎం ఎస్ ధోని క్రికెట్ కెరీర్ పలు ఊహాగానాలకు గురిచేయగా, ఈ సీజన్ లో, తనను విమర్శిస్తున్న వారికి చెప్పబోతున్నాడా అనేది వేచి చూడాల్సిందే. భవిషత్తుపై తదుపరి నిర్ణయం ఏమిటనే దానిపై స్థబ్దత నెలకొని ఉంది. మరోవైపు జనవరిలో బీసీసీఐ కేంద్ర కాంట్రాక్టు ఆటగాళ్ల జాబితా నుండి అతన్ని తొలగించిన విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల మధ్య తన బ్యాట్ తో సమాధానం చెప్పబోతున్నాడా?
BALL 1⃣ - SIX
BALL 2⃣ - SIX
BALL 3⃣ - SIX
BALL 4⃣ - SIX
BALL 5⃣ - SIXஐந்து பந்துகளில் ஐந்து சிக்ஸர்களை பறக்கவிட்ட தல தோனி!
முழு காணொளி காணுங்கள் 📹👇
#⃣ "The Super Kings Show"
⏲️ 6 PM
📺 ஸ்டார் ஸ்போர்ட்ஸ் 1 தமிழ்
📅 மார்ச் 8
➡️ @ChennaiIPL pic.twitter.com/rIcyoGBfhE— Star Sports Tamil (@StarSportsTamil) March 6, 2020
ధోని ఇప్పటివరకు 190 ఐపీఎల్ మ్యాచ్‌లు అడగా (రైజింగ్ పూణే సూపర్‌జైంట్స్ తరపున రెండు సీజన్లతో సహా) కాగా 23 హాఫ్ సెంచరీలతో 4,432 పరుగులు చేశాడు. ఐపీఎల్-2020 ఓపెనింగ్ మ్యాచ్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌తో మార్చి 29న వాంఖడే స్టేడియంలో తలపడనుంది.