Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియాకు తొలి స్వర్ణం లభించింది. హరియాణాకు చెందిన నీరజ్ చోప్డా తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు. ఊహించని విధంగా జావెలిన్ త్రోలో బంగారు పతకం సాధించాడు.
ఇండియాకు చెందిన నీరజ్ చోప్డా(Niraj Chopda) త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు. ఊహించని విధంగా అద్భుత ప్రతిభతో బంగారు పతకాన్ని సాధించిపెట్టాడు. హరియాణా రాష్ట్రంలోని పానిపత్ జిల్లాకు చెందిన సాధారణ రైతు కుమారుడు నీరజ్ చోప్డా. టోక్యో ఒలిపింక్స్(Tokyo Olympics)లో చరిత్ర సృష్టించాడు.అథ్లెటిక్స్ రంగంలో వందేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఇండియాకు స్వర్ణాన్ని సాధించిపెట్టాడు. ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగంలో 13 ఏళ్ల తరువాత లభించిన తొలి గోల్డ్ మెడల్. జావెలిన్ త్రో విభాగంలో 87.58 మీటర్ల దూరంతో జావెలిన్ (Javeline Throw)విసిరి స్వర్ణాన్ని ఎగురవేసుకుపోయాడు. ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశంలోని ప్రముఖులంతా నీరజ్ చోప్డాపై ప్రశంసలు కురిపించారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కంపెనీలు నజరానాలు ప్రకటించాయి. ఏడాది పాటు నీరజ్‌కు ఉచిత విమానయానాన్ని బహుమతిగా అందించింది ఇండిగో ఎయిర్ లైన్స్(Indigo Airlines) సంస్థ.
Also read: టోక్యో ఒలింపిక్స్: అదితి అశోక్‌కు గోల్ఫ్‌లో జస్ట్ మిస్ అయిన బ్రాంజ్ మెడల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook