Odi Cricket Records: బ్యాట్స్‌మెన్ క్రీజ్‌లోకి దిగిన తరువాత ఏదో ఒక బంతి ఔట్ అవ్వడం ఖాయం. ఒక మ్యాచ్ కాకపోయినా.. మరో మ్యాచ్‌లో అయినా ఔట్ అవుతాడు. కానీ టీమిండియా తరఫున వన్డే క్రికెట్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్‌లు తమకు తెలియకుండానే అలాంటి రికార్డును క్రియేట్ చేయడం విశేషం. వన్డే క్రికెట్‌లో తమ కెరీర్‌లో ఔట్‌కాని ముగ్గురు టీమిండియా బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు. భారత జట్టులోని ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లను వారి కెరీర్‌లో ప్రపంచంలోని ఏ బౌలర్ కూడా అవుట్ చేయలేకపోయాడు. భారత్‌కు చెందిన ఆ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లను ఒకసారి చూద్దాం..
1.సౌరభ్ తివారీ
సౌరభ్ తివారీ క్రికెట్‌లో వెలుగులోకి వచ్చినప్పుడు.. అతన్ని మహేంద్ర సింగ్ ధోనీతో పోల్చారు. ఈ పోలిక ఇద్దరి బ్యాటింగ్ గురించి కాదు జుట్టు గురించి ఉండేది. 2010లో భారత్ తరఫున అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించిన సౌరభ్ తివారీ.. పొడవాటి జుట్టుతో ధోనిలానే కనిపించేవాడు. సౌరభ్ తివారీ టీమిండియా తరపున మూడు వన్డేలు ఆడాడు. ఈ మూడు వన్డేలలో రెండు మ్యాచ్‌లలో మాత్రమే బ్యాటింగ్‌కు వచ్చాడు. అయితే అతను ఈ రెండు వన్డేలలోనూ ఔట్ కాలేదు. ఆ తరువాత అతను భారత జట్టులో స్థానం కోల్పోయాడు. ప్రస్తుతం సౌరభ్ తివారీ అంతర్జాతీయ కెరీర్ కూడా ముగిసింది.
2.ఫైజ్ ఫజల్
ఫైజ్ ఫజల్ 2016లో భారత్ తరఫున అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించాడు. ఫైజ్ ఫజల్ జింబాబ్వేతో వన్డే మ్యాచ్ ఆడేందుకు ఛాన్స్ దక్కించుకున్నాడు. ఆ మ్యాచ్‌లో అతను అజేయంగా 55 పరుగులు చేశాడు. కానీ ఈ మ్యాచ్ తర్వాత అతను మళ్లీ టీమిండియా తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. భారత్ తరఫున కేవలం ఒక్క వన్డే ఆడిన తర్వాత ఫైజ్ ఫజల్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. ఈ విధంగా ఫైజ్ ఫజల్ తన ఏకైక వన్డే మ్యాచ్‌లో ఔట్ అవ్వకుండా అద్వితీయ రికార్డులో భాగం అయ్యాడు.
3.భరత్ రెడ్డి
భరత్ రెడ్డి భారత్ తరఫున మూడు వన్డేలు ఆడాడు. ఈ మూడు వన్డేల్లో కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ రెండు వన్డేల రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ భరత్ రెడ్డి నాటౌట్‌గా నిలిచాడు. భరత్ రెడ్డి తన కెరీర్‌లో 1978 నుంచి 1981 వరకు మూడు వన్డేలు ఆడాడు. అయితే అతను ఈ మ్యాచ్‌లలో ఔట్ కాలేదు. కేవలం 4 టెస్టులు, 3 వన్డేలు మాత్రమే ఆడిన భరత్ రెడ్డి అంతర్జాతీయ కెరీర్ ముగిసింది.
Also Read: Manipur Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు విద్యార్థులు మృతి
Also Read: Telangana Health Director: ఏసు క్రీస్తు వల్లే కరోనా నయం.. వివాదంలో డీహెచ్ శ్రీనివాసరావు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook