Rohit Sharma Birthday: ప్రేమించిన అమ్మాయితో రోహిత్ శర్మ బ్రేకప్.. విరాట్ కోహ్లీనే అందుకు కారణం?

Rohit Sharma Birthday: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. తన పెళ్లికి ముందు నటి సోఫియా హయత్ తో ప్రేమాయణం సాగించాడు. పెళ్లిదాకా వచ్చిన వీరిద్దరి ప్రేమాయణం అనుకోకుండా బ్రేకప్ కు దారి తీసింది. అయితే అందుకు కారణం మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటూ వార్తలు వచ్చాయి. రోహిత్ శర్మతో బ్రేకప్ తర్వాత ఆమె సన్యాసినిగా మారిందంటూ గుసగుసలు వినిపించాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 30, 2022, 04:32 PM IST
Rohit Sharma Birthday: ప్రేమించిన అమ్మాయితో రోహిత్ శర్మ బ్రేకప్.. విరాట్ కోహ్లీనే అందుకు కారణం?

Rohit Sharma Birthday: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. 2015లో రితికా సజ్దేతో వివాహం చేసుకోవడానికి ముందు.. ప్రముఖ నటి గాయని సోఫియా హయత్ తో డేటింగ్ చేసిన విషయం చాలా మందికి తెలియదు. వీరిద్దరూ కలిసి ఎన్నోసార్లు కెమెరాకు కూడా చిక్కారు. విహారయాత్రల కోసం విదేశాలకూ వీరిద్దరూ కలిసి వెళ్లారు. అందుకు సంబంధించిన పిక్స్ అప్పుడు చాలా వైరల్ అయ్యాయి. అయితే అనుకోని కారణాల వల్ల రోహిత్ శర్మ, సోఫియా హయత్ విడిపోయారు. 

రోహిత్ శర్మ, సోఫియా హయత్ ప్రేమాయణం

2012లో రోహిత్ శర్మ, సోఫియా హయత్ రిలేషన్ షిప్‌లో ఉన్నారనే వార్తలు హల్ చల్ చేశాయి. వీరిద్దరూ కలిసి బయట కెమెరాకు చిక్కిన పిక్స్ వార్తా పత్రికలతో పాటు మీడియా కంట పడ్డాయి. అప్పట్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. 

 

రోహిత్ శర్మ కోసం నగ్నంగా..

2014లో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ అత్యధిక వ్యక్తిగత వన్డే స్కోరు 264 నమోదు చేశాడు. అందుకు బహుమతిగా సోఫియా హయత్.. న్యూడ్ ఫొటో సోషల్ మీడియాలో పంచుకొని, రోహిత్ శర్మపై తన ప్రేమను చాటింది. 

అనుకోని కారణాల వల్ల బ్రేకప్..

అయితే అప్పటి వరకు చెట్టాపట్టాలెసుకొని హాట్ టాపిక్ మారిన రోహిత్ శర్మ, సోఫియా హయత్ లు కొన్ని రోజుల తర్వాత విడిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే వీరి లవ్ బ్రేకప్ కు కారణం మాత్రం టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటూ అనేక వార్తలు పుట్టుకొచ్చాయి. అందులో నిజమెంతో ఇప్పటికి ఎవ్వరికీ తెలియరాలేదు. "మైదానంతో పాటు వెలుపల కూడా విరాట్ మెరుగైన ఆటగాడు" అని సోఫియా హయత్ అప్పట్లో ట్వీట్ చేసింది. అందుకే రోహిత్ శర్మను తాను తిరస్కరించినట్లు ఆమె చెప్పుకొచ్చింది. 

బ్రేకప్ తర్వాత సన్యాసిగా..

రోహిత్ శర్మతో బ్రేకప్ తర్వాత సోఫియా హయత్ సన్యాసినిగా మారిందంటూ అప్పట్లో వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఆ తర్వాత మోడల్ వ్లాడ్ స్టానెకు ను సోఫియా హయత్ వివాహం చేసుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.  

Also Read: Rohit Sharma Birthday: రోహిత్‌ శర్మ బర్త్ డే.. స్పెషల్‌ విషెస్‌ చెప్పిన విరాట్‌ కోహ్లీ!

Also Read: MI vs RR IPL 2022: వరుసగా 8 ఓటముల తర్వాత ముంబయి మరో దండయాత్ర.. రాజస్థాన్ తో నేడు మ్యాచ్?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News