ధోనీ రికార్డును బీట్ చేసిన రోహిత్ శర్మ

ధోనీ రికార్డును బీట్ చేసిన రోహిత్ శర్మ

Updated: Nov 4, 2019, 09:20 AM IST
ధోనీ రికార్డును బీట్ చేసిన రోహిత్ శర్మ

న్యూఢిల్లీ: ఇండియా vs బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్‌లో కేవలం 9 పరుగులే చేసి తన బ్యాటింగ్‌తో భారత క్రికెట్ ప్రియులను నిరాశపరిచిన రోహిత్ శర్మ.. వ్యక్తిగతంగా మాత్రం తన ఖాతాలో ఓ రికార్డు నమోదు చేసుకున్నాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌తో అత్యధిక టీ20లు ఆడిన టీమిండియా క్రికెటర్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. రోహిత్ శర్మ కెరీర్‌లో అతడికి ఇది 99వ టీ20 మ్యాచ్ కావడం విశేషం. దీంతో ఇప్పటివరకు  టీమిండియా మాజీ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట వున్న ఈ రికార్డును రోహిత్ శర్మ బద్దలుగొట్టినట్లయింది. 

ఇప్పటివరకు 98 టీ20లు ఆడిన మహేంద్ర సింగ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఇప్పుడా రికార్డును రోహిత్ శర్మ అధిగమించాడు. 78 టీ20లతో సురేశ్ రైనా ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.