IPL 2020: RCB కొత్త జెర్సీ, థీమ్ సాంగ్‌ రిలీజ్

ఐపీఎల్‌ (IPL) 2020 ప్రారంభానికి ఇంకా కొన్నిగంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో ఎలాగైనా సత్తాచాటాలని జట్లన్నీ సంసిద్ధంగా ఉన్నాయి. విరాట్ కోహ్లీ సారథ్యంలోని ఐపీఎల్ ఫెవరెట్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) కూడా ఎలాగైనా కప్‌ను సొంతం చేసుకోవాలని ఫుల్ జోష్‌తో కనిపిస్తోంది.

Last Updated : Sep 18, 2020, 06:55 PM IST
IPL 2020: RCB కొత్త జెర్సీ, థీమ్ సాంగ్‌ రిలీజ్

IPL-2020 RCB Official Anthem and new Jersey release: న్యూఢిల్లీ: ఐపీఎల్‌ (IPL) 2020 ప్రారంభానికి ఇంకా కొన్నిగంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో ఎలాగైనా సత్తాచాటాలని జట్లన్నీ సంసిద్ధంగా ఉన్నాయి. విరాట్ కోహ్లీ సారథ్యంలోని ఐపీఎల్ ఫెవరెట్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) కూడా ఎలాగైనా కప్‌ను సొంతం చేసుకోవాలని ఫుల్ జోష్‌తో కనిపిస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం ఆర్‌సీబీ ఫ్రాంఛైజీ జట్టు కోసం కొత్త జెర్సీని ఆవిష్కరించడంతోపాటు... కన్నడ స్టైల్లో ఆంథెమ్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసి.. అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారితో యుద్ధం చేసేందుకు ఫ్రంట్‌లైన్‌లో ఉన్న హీరోస్‌కి ఆర్‌సీబీ నివాళులర్పిస్తుందంటూ ఫ్రాంఛైజీ ఈ మేరకు జెర్సీతోపాటు.. సరికొత్త నేపథ్య గీతాన్ని ఆవిష్కరించింది. Also read: MI vs CSK: ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్.. మినీ ఫైనల్!

ఇదిలాఉంటే.. ఆర్‌సీబీ ఫ్రాంఛైజీ థీమ్‌ సాంగ్‌లో కన్నడ పదాలు లేవని చాలామంది కన్నడీయులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అభిమానుల కోరిక మేరకు స్థానిక భాషకే ప్రాధాన్యమిస్తూ.. సరికొత్త స్టైల్లో ఆంథెమ్‌ను రిలీజ్ చేసింది. ఇది వచ్చి రాగానే అభిమానులను అలరిస్తోంది. ఇదిలాఉంటే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సోమవారం (సెప్టెంబరు 21న) సన్ రైజర్స్ హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) తో తలపడనుంది. Also read: RCB in IPL 2020: స్థానికతకు ఆర్సీబీ ప్రాధాన్యం

The RCB team will proudly don a tribute jersey with the message “My Covid Heroes” both during training & matches during the #Dream11IPL in honour of all the Real Challengers who have helped the world during these uncertain times. 🌟🌟🌟#PlayBold #IPL2020 #WeAreChallengers pic.twitter.com/yazAHvHmBQ

 

Trending News