Aakash Chopra feels Sarfaraz Khan would have been cast instead of Suryakumar Yadav: శ్రీలంక వన్డే సిరీస్ అనంతరం ఆస్ట్రేలియాతో భారత్ స్వదేశంలో తలపడనుంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 2023 ఫిబ్రవరి 9 నుంచి నాలుగు టెస్టుల సిరీస్ 'బోర్డర్-గావస్కర్ ట్రోఫీ' ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ సిరీస్‌లో తొలి రెండు టెస్టుల కోసం శుక్రవారం (జనవరి 13) బీసీసీఐ సెలక్టర్లు 17 మందితో కూడిన భారత జట్టును ప్రకటించారు. ఇటీవల సెంచరీలతో చెలరేగిన ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ మొదటిసారి భారత టెస్టు జట్టులోకి వచ్చారు. గాయం నుంచి కోలుకున్న స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా జట్టులోకి వచ్చేశాడు.
గత కొంతకాలంగా దేశవాళీ టోర్నీలలో అద్భుతంగా రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్‌కు మాత్రం భారత టెస్ట్ జట్టులో చోటు దక్కలేదు. ఈ విషయంపై భారత మాజీ ఓపెనర్, స్టార్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా నిరాశ వ్యక్తం చేశారు. సూర్యకుమార్ యాదవ్‌కి బదులుగా.. సర్ఫరాజ్ ఖాన్‌ని ఎంపిక చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. సర్పరాజ్ గత రెండు రంజీ సీజన్లలో పరుగులు చేశాడు. 2019-20 సీజన్‌లో 928 పరుగులు, 2021-22లో 982 రన్స్ చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో 5, 126 నాటౌట్, 75, 20, 162, 15 నాటౌట్, 28 నాటౌట్ పరుగులతో మంచి ప్రదర్శన చేస్తున్నాడు.
'భారత టెస్టు జట్టులో ప్రస్తుతం పలు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సర్ఫరాజ్ ఖాన్ ఓ స్థానాన్ని భర్తీ చేస్తాడని అనుకున్నా. జాతీయ జట్టులోకి రావడానికి అతడు చేయాల్సిందంతా చేశాడు. అయినా ఎందుకు ఎంపిక కాలేదో అర్ధం కావడం లేదు. సర్ఫరాజ్ పేరు లేదు కాబట్టి తాను మోసపోయానని అతడు అనుకుని ఉంటాడు. జస్ప్రీత్ బుమ్రా పేరు కూడా లేదు. అయితే అది వేరే విషయం. అతడికి గాయం అయింది. బీసీసీఐ నిర్ణయంతో నేను కాస్త నిరాశ చెందా' ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో అన్నారు.
'సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేశారు అంటే.. జట్టులో ఒక స్థానం ఖాళీగా ఉందని అర్థం. సూర్యకుమార్, సర్ఫరాజ్ ఖాన్ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోమంటే.. సర్ఫరాజ్‌ను ఎంపిక చేసుకుంటా. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సర్ఫరాజ్ సగటు 80. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సర్ఫరాజ్ కంటే ముందు సర్ డాన్ బ్రాడ్‌మన్ మాత్రమే ఉన్నాడు. భారత జట్టులోకి రావడానికి సర్ఫరాజ్ తన శక్తి మేరకు కృషి చేశాడు. ఏ ఆటగాడు అయినా దేశవాళీ క్రికెట్లో రాణిస్తే అతడికి తగిన గుర్తింపునివ్వాలి' అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నారు.
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహ్మద్ షమీ, మొహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా.
Also Read: Rashi Khanna Pics: లిమిట్స్ క్రాస్ చేసేసిన రాశి ఖన్నా.. హాట్ స్టిల్స్ చూస్తే మతిపోవాల్సిందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
IND vs AUS: సూర్యకుమార్ యాదవ్‌కి బదులుగా.. సర్ఫరాజ్ ఖాన్‌ని ఎంపిక చేస్తే బాగుండేది! మాజీ క్రికెటర్ అసహనం
భారత్‌తో టెస్టు సిరీస్
ఆస్ట్రేలియా జట్టు ఇదే
ఏకంగా నలుగురు స్పిన్నర్లు