అంబటి రిటైర్డ్ మెంట్ పై సచిన్ ఎమోషనల్ రియాక్షన్ !

క్రికెట్ కు గుడ్ బై చెప్పిన అంబటి రాయుడి పట్ల పరామర్శల పర్వం కొనసాగుతోంది.

Last Updated : Jul 4, 2019, 05:18 PM IST
అంబటి రిటైర్డ్ మెంట్ పై సచిన్ ఎమోషనల్ రియాక్షన్ !

అంబటి రాయుడు రిటైర్డ్ మెంట్ పై ప్రముఖులు స్పందిస్తూన్నారు. ఇప్పుడు తాజాగా క్రికెట్ దేవుడు సచిన్ రియాక్ట్ అయ్యాడు. అంబటీ రాయుడు పేరును ప్రస్తావిస్తూ ..నీవు భారత క్రికెట్ కు చేసిన సేవలకు కృతజ్ఞతలు.. నీ సేవలు దేశం గుర్తుంచుకుంటుంది. ఇదే సమయంలో ఐపీఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ కు నీవు ఆడిన సమయంలో ఎన్నో మధురస్మృతులున్నాయి అంటూ అంబటితో ఉన్న అనుబంధాన్ని సచిన్ ఇలా గుర్తు చేసున్నాడు. అంబటి సెకండ్ ఇన్నింగ్స్ లో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను" అంటూ సచిన్ ట్వీట్ చేశాడు.

 

క్రికెట్ లో లక్ష్మణ్ తర్వాత అంతటి గొప్ప క్రికెటర్ గా పేరుతెచ్చున్న తెలుగుతేజం అంబటి రాయుడు.. అన్ని ఫార్మట్లకు రిటైర్ట్ మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచకప్ జట్టులో తనకు స్థానం కల్పించకపోవడం.చివరికి వెయిటింగ్ లిస్టులో ఉన్న తనను పక్కనబెట్టి అనూహ్యరీతిలో మయాంక్ అగర్వాల్ ను ఇంగ్లాండ్ పంపించడంతో తీవ్ర మనస్తాపం చెందిన రాయుడు అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. దీంతో అంబటి రిటైర్మ్ మెంట్ పై క్రీడా ప్రముఖులు ఇలా స్పందిస్తున్నారు.

More Stories

Trending News