Abhishek Sharma: మోడల్ ఆత్మహత్య... సన్ రైజర్స్ ప్లేయర్ కు నోటీసులు..

Abhishek Sharma: సన్ రైజర్స్ ఆటగాడు అభిషేక్ శర్మ వివాదంలో చిక్కున్నాడు. మోడల్ తానియా సింగ్ సూసైడ్ కేసులో అభిషేక్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 21, 2024, 02:37 PM IST
Abhishek Sharma: మోడల్ ఆత్మహత్య... సన్ రైజర్స్ ప్లేయర్ కు నోటీసులు..

Surat Model Suicide Case: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ చిక్కుల్లో పడ్డాడు. తానియా సింగ్ అనే మోడల్ ఆత్మహత్య కేసులో అభిషేక్ శర్మను పోలీసులు విచారణకు పిలిచినట్లు గుజరాత్ తక్ రిపోర్ట్ వెల్లడించింది. దీంతో ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 

అసలేం జరిగింది..
నిన్న మంగళవారం (ఫిబ్రవరి 20) రాత్రి తానియా సింగ్(28) అనే మోడల్ ఆత్మహత్య చేసుకుంది. సూరత్ లోని హ్యాపీ ఎలిగెన్స్ అపార్ట్‌మెంట్లో ఉన్న తన ఇంట్లోనే తానియా ఈ బలవన్మరణానికి పాల్పడింది. దీంతో ఆమె కుటుంబం ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఆమె సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగానే సన్ రైజర్స్ క్రికెటర్ అభిషేక్ శర్మను విచారణకు పిలిచినట్లు గుజరాత్ తక్ తన రిపోర్టులో వెల్లడించింది. అయితే తానియాకు, అభిషేక్ కు సంబంధం ఏంటనేది తేలాల్సి ఉంది. 

లవ్ ఎఫైరే కారణమా?
తానియా సూసైడ్ కు లవ్ ఎఫైరే కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కొన్నాళ్లుగా అభిషేక్ తో తానియా మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. తానియా తన చివరి ఫోన్ కాల్ కూడా అభిషేక్ కే చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో అతడికి పోలీసులు సమన్లు జారీ చేసినట్లు సమాచారం. ఈ కేసులో కాల్ రికార్డింగ్స్ కీలక ఆధారం కానున్నాయి. 

ఐపీఎల్ కెరీర్
ఐపీఎల్ లో 2018లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున తొలిసారి బరిలోకి దిగాడు అభిషేక్ శర్మ. ఆ సీజన్ లో కేవలం మూడు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. 2022 నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడుతున్నాడు. 2022 సీజన్ లో 14 మ్యాచ్ ల ఆడిన అభిషేక్ 426 పరుగులు చేశాడు. గత సీజన్లోనూ సన్ రైజర్స్ తరఫున 11 మ్యాచ్ లు ఆడి 226 రన్స్ చేశాడు. వచ్చే నెల చివరిలో ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో అభిషేక్ ఇలా కేసులో చిక్కుకోవడం అతడి కెరీర్ మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. 

Also Read: IPL 2024 Schedule: ఐపీఎల్‌ ప్రారంభంపై స్పష్టత.. అప్పటి నుంచే మొదలవుతుందని చైర్మన్‌ ప్రకటన

Also Read: Virat Kohli Deepfake: డీప్‌ ఫేక్ వలలో విరాట్ కోహ్లీ.. వైరల్ అవుతున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News