Sunil Gavaskar on T20 World Cup 2022 Team India playing XI: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కాబోతోంది. మొహాలి వేదికగా మంగళవారం ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. టీ20 ప్రపంచకప్ 2022కి ముందు జరగబోయే ఈ మ్యాచ్‌లను భారత్ మంచి సన్నాహకంగా భావిస్తోంది. తుది జట్టులో మార్పులు చేసుకొని మెగా టోర్నీకి పటిష్ట జట్టును తీర్చిదిద్దుకోవాలనుకుంటోంది. ముఖ్యంగా మిడిలార్డర్ విఫలమవుతున్న నేపథ్యంలో ఆ లోపాలను అధిగమించి సరైన ప్లేయింగ్ ఎలెవన్‌ను ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోంది.
టీమిండియా వికెట్ కీపర్లు దినేశ్ కార్తిక్, రిషబ్ పంత్ ఇద్దరూ ఇటీవలి కాలంలో జట్టులో చోటు దక్కించుకుంటున్నారు. ఆసియా కప్ 2022లో పాల్గొన్న జట్టులోనూ ఇద్దరికీ చోటు దక్కింది. అయితే తుది జట్టు లో డీకే కంటే పంత్ వైపే టీమిండియా మేనేజ్మెంట్ ఎక్కువగా మొగ్గు చూపుతోంది. కీలక టీ20 ప్రపంచకప్ జట్టుకు కూడా వీరిద్దరు ఎంపికైన నేపథ్యంలో.. తుది జట్టులో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో భారత్ బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
తాజాగా స్పోర్ట్స్ టాక్ షోలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... 'నేను రిషబ్ పంత్, దినేష్ కార్తీక్ ఇద్దరికీ టీ20 ప్రపంచకప్ 2022 తుది జట్టులో అవకాశం ఇస్తా. పంత్ ఐదో స్థానంలో.. హార్దిక్ పాండ్యా ఆరో స్థానంలో ఆడతారు. డీకే ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. నేను హార్దిక్ కాకుండా మరో నలుగురు బౌలర్లను తుది జట్టులో ఎంపిక చేసుకుంటా. రిస్క్ తీసుకోకపోతే మీరు ఎలా గెలుస్తారు?. అన్ని విభాగాలలో రిస్క్ తీసుకోవాలి, అప్పుడు మాత్రమే రిజల్ట్స్ వస్తాయి' అని అన్నారు.
సునీల్ గవాస్కర్ చెప్పిన ప్రకారం... రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారు. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ వరుసగా 3, 4 స్థానాల్లో ఆడతారు. హార్దిక్ పాండ్యా కచ్చితంగా జట్టులో ఉంటాడు. ఇక దినేష్ కార్తీక్ మరియు రిషబ్ పంత్ ఇద్దరూ తుది జట్టులో ఉంటే.. భారత్ ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఐదుగురిలో ఎవరైనా ఒకరు విఫలమయితే.. ఆ రోజు టీమిండియాకు మరో ఆప్షన్ ఉండదు.
ఇటీవల ముగిసిన ఆసియా కప్ 2022లో పాకిస్థాన్‌తో జరిగిన గ్రూప్ A మ్యాచులో భారత్ మేనేజ్మెంట్ రిషబ్ పంత్ కంటే దినేష్ కార్తీక్‌కు ప్రాధాన్యతనిచ్చింది. అయితే పాకిస్థాన్ మరియు శ్రీలంకతో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లలో అనుభవజ్ఞుడైన డీకే కంటే పంత్ వైపు మొగ్గుచూపింది. ఇద్దరు కలిసి రెండు మ్యాచ్‌లలో ఆడారు. అయితే హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వడం వల్లనే అది సాధ్యమైంది. ప్రపంచకప్ 2022లో హార్థిక్ ఉంటాడు కాబట్టి తుది జట్టులో ఎవరు ఉంటారో చూడాలి.
Also Read: Neha Malik Bikini Pics: నేహా మాలిక్ బికినీ ట్రీట్.. చూడ్డానికి రెండు కళ్లు చాలవు!
Also Read: Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. Realme 9 5G SEపై రూ. 5 వేల ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.