IND vs SA: పంత్‌కు ఛాన్స్ ఇస్తారా లేక రాహుల్ ను కొనసాగిస్తారా.. సఫారీతో మ్యాచ్ కు తుది జట్టు ఇదే!

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్‌లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ టీమిండియా, సౌతాఫ్రికా జట్లు పెర్త్ వేదికగా తలపడనున్నాయి.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2022, 09:58 AM IST
IND vs SA: పంత్‌కు ఛాన్స్ ఇస్తారా లేక రాహుల్ ను కొనసాగిస్తారా.. సఫారీతో మ్యాచ్ కు తుది జట్టు ఇదే!

T20 World Cup 2022, IND vs SA Predicted Playing 11: టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12 పోరులో భాగంగా ఇవాళ రెండు బలమైన జట్లు ఢీకొనబోతున్నాయి. గ్రూప్2 లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కోసం పోటీపడుతున్న ఈ రెండు జట్లు ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటింగ్ కలిగిన జట్టు ఒకటైతే... టాప్ బౌలింగ్ కలిగిన టీమ్ మరొకటి. అవే టీమిండియా, సౌతాఫ్రికా. ఈ రెండు జట్లు మధ్య ఇవాళ పెర్త్ వేదికగా వాకా స్టేడియంలో మ్యాచ్ (India vs South Africa) జరగనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 4.30 నుంచి ప్రారంభం కానుంది. 

ఇరు జట్ల బలబలాలను పరిశీలిస్తే.. భారత్ ఈ మ్యాచ్ లో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. అయితే కేఎల్ రాహుల్ ఫామ్ టీమిండియాను కలవరపెడుతోంది. పాక్, నెదర్లాండ్స్ తో మ్యాచుల్లో నిరాశపరిచిన రాహుల్ ఈ మ్యాచ్ ద్వారానైనా గాడిలో పడాలని టీమ్ మేనెజ్ మెంట్ భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్ లో రాహుల్ ప్లేస్ లో పంత్ ను జట్టులోకి తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ బిగ్ సెలెక్షన్ డిబేట్‌లో ప్రసంగించారు. దక్షిణాఫ్రికాతో పెర్త్‌లో జరిగే మ్యాచ్‌కు రిషబ్ పంత్ లేదా రాహుల్ ల్లో ఎవరికి అవకాశమిస్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. రాహుల్ నే కొనసాగిస్తామా అని విక్రమ్ అన్సర్ ఇచ్చారు. పంత్‌ను సిద్ధంగా ఉండాలని చెప్పామని.. త్వరలో జరిగే మ్యాచ్‌ల్లో అవకాశం కల్పిస్తామని ఆయన అన్నారు. 

తుది జట్లు ఇవే...
భారత్: రోహిత్ శర్మ (సి), కేఎల్ రాహుల్/రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్/దీపక్ హుడా, దినేష్ కార్తీక్, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, మహమ్మద్ షమీ
దక్షిణాఫ్రికా: టి బావుమా (సి), ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, రిలీ రోసోవ్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, క్వింటన్ డి కాక్, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నార్టే, కగిసో రబడ, తబ్రైజ్ షమ్సీ

Also Read: India vs South Africa: సఫారీతో పోరుకు సై అంటున్న భారత్.. సాయంత్రం 4.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Apple Link - https://apple.co/3loQYe 

Android Link https://bit.ly/3P3R74U

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News