Things Favour for India against Pakistan Clash In T20 World Cup says Shan Masood: టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా చిరకాల ప్రత్యర్థి భారత్‌పై పాకిస్తాన్ ఓడిన విషయం తెలిసిందే. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఇఫ్తికార్ అహ్మద్ (51; 34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు), షాన్ మసూద్ (52 నాటౌట్; 42 బంతుల్లో 5 ఫోర్లు) అర్ధ శతకాలు బాదారు. భారత బౌలర్లలో అర్శ్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (82 నాటౌట్; 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లలో హరీస్ రవుఫ్, మహమ్మద్ నవాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
చివరి ఓవర్లో భారత్ లక్ష్యం 16 పరుగులు. మొహ్మద్ నవాజ్ వేసిన తొలి బంతికే హార్దిక్ పాండ్యా క్యాచ్ ఔట్ అయ్యాడు. రెండో బంతికి దినేష్ కార్తీక్ సింగిల్ తీయగా.. మూడో బంతికి విరాట్ కోహ్లీ రెండు పరుగులు చేశాడు. దాంతో భారత్ సమీకరణం 3 బంతుల్లో 13 పరుగులుగా మారింది. నాలుగో బంతిని నవాజ్ ఫుల్‌టాస్ వేయగా కోహ్లీ సిక్సర్ బాదేశాడు. అది నోబాల్ కావడంతో.. భారత్ 3 బంతుల్లో 6 పరుగులే చేయాల్సి వచ్చింది. అదనంగా ఫ్రీహిట్ కూడా దొరికింది. నాలుగో బంతి వైడ్. నాలుగో బంతికి (లీగల్) కోహ్లీ బౌల్డయినా.. ఫ్రీహిట్ కావడంతో.. భారత బ్యాటర్లు మూడు పరుగులు తీశారు. ఐదో బంతికి కార్తీక్ స్టంపౌట్ అయ్యాడు. ఆరో బంతికి ఆర్ అశ్విన్ స్ట్రైకింగ్‌కు రాగా.. వైడ్ బాల్ పడింది. దాంతో భారత్ విజయానికి చివరి బంతికి ఒక్క పరుగు అవసరం అయింది. చివరి బంతికి యాష్ సింగిల్ తీయడంతో మ్యాచ్ భారత్ సొంతమైంది.
మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ఓటమిపాలైన పాకిస్థాన్.. ఆ తర్వాత పసికూన జింబాబ్వే చేతిలోనూ దారుణంగా ఓడిపోయింది. నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లపై గెలిచిన పాక్.. అదృష్టం కలిసొచ్చి సెమీస్ చేరింది. సెమీస్ చేరినా.. జింబాబ్వే, భారత్ చేతిలో ఓటములు ఆ జట్టును విమర్శల పాలు చేసింది. ఈ అంశంపై తాజాగా పాకిస్తాన్ బ్యాటర్ షాన్ మసూద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌పై గెలవలేకపోవడానికి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడమే కారణం అని చెప్పాడు. అయితే జింబాబ్వేతో ఓటమికి మాత్రం పూర్తిగా జట్టు వైఫల్యమే అని ఒప్పుకున్నాడు.
'మెగా టోర్నీలో కీలకమైన క్షణాలను మేం సద్వినియోగం చేసుకోలేకపోయాం. ఈ కారణంతోనే చివరి బంతికి భారత్ చేతిలో ఓడాం. 8 బంతుల్లో 28 పరుగులు అవసరమైన దశలో ఇక మేం గెలిచినట్టేనని భావించాం. కానీ పరిస్థితులు భారత జట్టుకు అనుకూలంగా మారాయి. అందుకే రోహిత్ టాస్ గెలిచారు. భారత్ బ్యాటింగ్‌కు దిగే సమయానికి అక్కడి పరిస్థితులు మెరుగయ్యాయి. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో మేం గొప్ప ప్రదర్శన చేశాం. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో చాలా పొరపాట్లు చేశాం. పవర్‌ప్లేలో మా బౌలింగ్ పేలవంగా ఉంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే నాలుగు మ్యాచులను గెలిచే వాళ్లం. క్రికెట్ నిలకడగా, సమష్టిగా ఆడాల్సిన ఆట' అని షాన్ మసూద్ చెప్పాడు.
Also Read: Virat Kohli: ఆ లక్షణాలే.. విరాట్ కోహ్లీ సక్సెస్‌కు కారణం: శిఖర్ ధావన్
Also Read: వెరైటీ డ్రెస్‌లో వయ్యారాలు ఒలికిస్తున్న ఐశ్వర్య లక్ష్మి.. అచ్చు పాలరాతి బొమ్మలా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి