IND vs NZ: టీమిండియా అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌.. భారత్, న్యూజిలాండ్‌ తొలి టీ20 రద్దు!

Will Rain Play Spoil Sport During India vs New Zealand 1st T20I. భారత్, న్యూజిలాండ్‌ తొలి టీ20 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 17, 2022, 07:20 PM IST
  • భారత్, న్యూజిలాండ్‌ తొలి టీ20
  • అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌
  • తొలి టీ20 రద్దు
IND vs NZ: టీమిండియా అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌.. భారత్, న్యూజిలాండ్‌ తొలి టీ20 రద్దు!

Rain Threat for India vs New Zealand 1st T20I: టీ20 ప్రపంచకప్‌ 2022 ముగిసి వారం కూడా గడవకముందే భారత క్రికెట్ అభిమానులు పొట్టి మ్యాచ్‌లను ఎంజాయ్ చేయనున్నారు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం (నవంబర్ 18) న్యూజిలాండ్‌తో భారత్‌ తొలి టీ20 మ్యాచ్‌ ఆడనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, దినేష్ కార్తీక్ వంటి సీనియర్లు లేకుండా టీమిండియా బరిలోకి దిగుతోంది. టీ20 జట్టుకు హార్దిక్‌ పాండ్యా కెప్టెన్ కాగా.. రిషబ్ పంత్‌ వైస్‌ కెప్టెన్‌. సీనియర్లు లేకున్నా భారత్ పటిష్టంగానే ఉంది. 

సూర్యకుమార్‌ యాదవ్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. మరోసారి టీ20 మ్యాచ్‌లలో చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నాడు. హార్దిక్‌ పాండ్యా బ్యాట్, బంతితో రాణిస్తున్నాడు. యువ ఆటగాళ్లు శుభ్‌మన్‌ గిల్, సంజూ శాంసన్‌, రిషబ్ పంత్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, ఇషాన్‌ కిషన్‌ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అయితే వీరిలో తుది జట్టులో ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. హుడా, అయ్యర్‌కు తుది జట్టులో చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తోంది. మరి కెప్టెన్ ఎవరికి అవకాశం ఇస్తాడో చూడాలి. 

బౌలింగ్ విభాగంలో మహ్మద్‌ సిరాజ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, అర్షదీప్‌ సింగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, యుజ్వేంద్ర చహల్‌ ఆడే అవకాశాలు ఉన్నాయి. దాంతో ఉమ్రాన్‌ మాలిక్‌, కుల్దీప్‌ యాదవ్‌, హర్షల్‌ పటేల్‌ బెంచ్‌కే పరిమితం కానున్నారు. మరోవైపు భారత్‌ మాదిరిగానే టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌లో ఓడిన న్యూజిలాండ్‌ దాదాపుగా అదే జట్టుతో ఆడనుంది. పొట్టి కప్‌లో బరిలోకి దిగిన జట్టులో ఒకరిద్దరు మినహా మిగతావారిని భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు కివీస్ బోర్డు ఎంపిక చేసింది. 

భారత్, న్యూజిలాండ్‌ తొలి టీ20 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. శుక్రవారం వెల్లింగ్టన్‌లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావారణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం రావడానికి 50 శాతం కంటే ఎక్కువ ఉన్నట్లు చెప్పింది. మ్యాచ్ సమయంలో భారీ వర్షాలు కురుస్తాయట. గత రెండు రోజులుగా వెల్లింగ్టన్‌లో వర్షాలు కురిస్తున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటికే పిచ్‌ను కవర్స్‌తో కప్పి ఉంచారు. శుక్రవారం మొత్తం భారీ వర్షం కురిస్తే.. భారత్, న్యూజిలాండ్‌ తొలి టీ20 మ్యాచ్‌ రద్దు అవుతుంది. 

Also Read: IND vs NZ Dream11 Team: భారత్, న్యూజిలాండ్‌ తొలి టీ20.. డ్రీమ్ ఎలెవన్ టీమ్ ఇదే! కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్  

Also Read: ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములు.. టాప్ 10 జాబితా ఇదే! అగ్రస్థానం ఏ పాముదో తెలుసా 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News