విరాట్ కోహ్లీ పెళ్లిపై బీజేపీ ఎమ్మెల్యే సూటి ప్రశ్న

'విరుష్క' వివాహంపై ఒక బీజేపీ ఎమ్మెల్యే పన్నలాల్ శక్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తాజాగా వార్తల్లో నిలిచారు. విదేశాలకు వెళ్లి వివాహం చేసుకోవటంపై ప్రశ్నలు సంధించారు. 

Last Updated : Dec 19, 2017, 07:09 PM IST
విరాట్ కోహ్లీ పెళ్లిపై బీజేపీ ఎమ్మెల్యే సూటి ప్రశ్న

క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటి అనుష్కా శర్మల వివాహం ఇటీవల టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ఈ జంట సోషల్ మీడియాలో పంచుకున్న ప్రతి ఫోటో ఎంతలా వైరల్ అయ్యిందో అందరికీ తెలుసు. అయితే 'విరుష్క' వివాహంపై ఒక బీజేపీ ఎమ్మెల్యే పన్నలాల్ శక్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తాజాగా వార్తల్లో నిలిచారు. విదేశాలకు వెళ్లి వివాహం చేసుకోవటంపై ప్రశ్నలు సంధించారు. 
 
"రాముడు, కృష్ణుడు, యుధిష్ఠిరుడు భారతదేశంలో పెళ్లి చేసుకున్నారు. మీరందరూ పెళ్లి చేసుకోవాలి. భారత దేశంలో పెళ్లి చేసుకోవాలి. వాళ్లలాగా విదేహాలకు వెళ్లి పెళ్లి చేసుకోవడం కాదు. అతనుడబ్బు, ఖ్యాతి ఇక్కడే సంపాదించాడు. పెళ్లి విదేశాల్లో చేసుకున్నాడు" అని ఎమ్మెల్యే అన్నారు.

ప్రశ్నలు సంధించిన బీజేపీ ఎమ్మెల్యే పై కొంతమంది సోషల్ మీడియా నెటిజన్లు విరుచుకుపడ్డారు.   

 

 

ఈ జంట జంట డిసెంబర్ 11, 2017 లో ఇటలీలోని టుస్కానీలో  కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకున్నారు. డిసెంబర్ 21న న్యూ ఢిల్లీలో రిసెప్షన్ ను నిర్వహిస్తారు. డిసెంబర్ 26న ముంబైలో బాలీవుడ్, క్రికెటర్ల కోసం విందు ఏర్పాటుచేస్తున్నారు.

Trending News