తెలంగాణలో 'కరోనా వైరస్' కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 49 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. మరోవైపు జీహెచ్ఎంసీ కార్మికులకు, వైద్యసిబ్బందికి .. కరోనా వైరస్ ను ధీటుగా ఎదుర్కునేందుకు నిత్యం పని చేస్తున్న వారికి పారితోషికాలు ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్.
'కరోనా వైరస్'తో పోరాడుతున్న అమెరికాకు చేదోడు వాదోడుగా నిలిచినందుకు భారత దేశానికి ధన్యవాదాలు.. అంటూ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ట్వీట్ చేశారు. అంతే కాదు ప్రధాని నరేంద్ర మోదీ ఒక గొప్ప నాయకుడు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.
కొద్ది రోజుల క్రితం భారత్ పై చిర్రుబుర్రులాడిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మెత్తబడ్డారు. అంతే కాదు థ్యాంక్యూ మోదీ అంటూ కృతజ్ఞతలు చెప్పారు. పైగా భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతకీ పెద్దన్నకు ఎందుకు కోపమొచ్చింది..?
'కరోనా వైరస్' మహమ్మారి.. మానవ చరిత్రనే ప్రశ్నిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మనిషి మనుగడకే సవాల్ విసురుతోందని తెలిపారు. ప్రపంచ దేశాలకు పెను సవాలుగా మారిన ఈ మహమ్మారిని మూకుమ్మడిగా ఎదుర్కోవాలని మరోసారి పిలుపునిచ్చారు.
దేశ రాజధాని ఢిల్లీలో 'కరోనా వైరస్' ఉద్ధృతి తగ్గడం లేదు. రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా నిజాముద్దీన్ మర్కజ్ భవనం ప్రభావం ఎక్కువగా ఉంది. రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసుల్లో వారే ఎక్కువగా కనిపిస్తున్నారు.
ప్రపంచాన్ని గజగజా వణికిస్తున్న 'కరోనా వైరస్' చైనాలోని వుహాన్లో ప్రారంభమైంది. దాంతో అక్కడ లాక్ డౌన్ విధించారు. ఐతే రెండు నెలల పాటు కొనసాగిన లాక్ డౌన్ నేటితో అంతమైంది. ఈ రోజు నుంచి వుహాన్లో లాక్ డౌన్ ఎత్తివేస్తున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అక్కడి జనం ఊపిరిపీల్చుకున్నారు.
'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తోంది. దీంతోపాటు దేశంలో 'కరోనా వైరస్' గురించి సమాచారం కూడా వేగంగా వ్యాపిస్తోంది. ఇందులో కొంత మంచి సమాచారం కాగా.. మరికొంత ఫేక్ సమాచారం కూడా ఉంటోంది. ముఖ్యంగా ఈ సమాచారం సోషల్ మీడియాలో వెబ్సైట్లతోపాటు సోషల్ మీడియా మెసేంజర్లలో విపరీతంగా వైరల్ అవుతోంది.
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. 'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న వేళ.. అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.
'కరోనా వైరస్' ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. 21 రోజుల పాటు అన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. దీంతో జనం గడప దాటకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా రోడ్లపై ఎవరూ కనిపించడం లేదు. రోడ్లన్నీ నిర్మానుష్యంగానే దర్శనమిస్తున్నాయి.
'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా గజగజా వణికిస్తోంది. దీంతో ప్రపంచ దేశాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది.
'కరోనా వైరస్' మహమ్మారిని ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న ఔషధం 'హైడ్రాక్సీక్లోరోక్విన్'. ప్రస్తుతం ఈ ఒక్క ఔషధం మాత్రమే గేమ్ చేంజర్ గా ఉంది. అంటే దీని ద్వారా కరోనా వైరస్ లొంగి వస్తోంది. ఫలితంగా ఈ ఔషధాన్ని తయారు చేస్తున్న భారత్ వైపు అన్ని దేశాల చూపు నెలకొంది.
'కరోనా వైరస్' దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ విలవిలలాడిపోతున్నాయి. ప్రజలంతా బిక్కు బిక్కుమంటూ కాలం గడిపే పరిస్థితి నెలకొంది. భారత దేశంలోనూ కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఐతే లాక్ డౌన్ విధించడంతో కొంత మేర పరిస్థితి మెరుగుపడింది.
'కరోనా వైరస్' ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. అగ్ర దేశాలతోపాటు చిన్న చిన్న దేశాల్లోనూ ప్రజలు భయం గుప్పిట్లో బతుకీడుస్తున్నారు. 'కరోనా వైరస్' బారి నుంచి తప్పించుకునేందుకు అన్ని రకాల నిబంధనలు పాటిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.