తెలంగాణ రాష్ట్ర మంత్రికి అరుదైన ఆహ్వానం అందింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల్లో పాల్గొనాల్సిందిగా కోరుతూ.. ఫోరమ్ నిర్వాహకులు కేటీఆర్ కు ఆహ్వానం పంపారు.
కొందరు బాధ్యత లేని వ్యక్తుల వల్ల... ఓ లారీ డ్రైవర్ నిర్వాకం వల్ల... ఓ కుటుంబం పెను విషాదాన్ని మూటగట్టుకుంది. ముక్కుపచ్చలారని తొమ్మిదేళ్ళ చిన్నారి భూమిక ఉప్పల్ చిలుకానగర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం నడిరోడ్డుపై అసువులు బాసిన వైనం అక్కడున్న వారినందరినీ కన్నీళ్లు పెట్టించింది.
బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బిజినెస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సమావేశంలో ఆ సంస్థ తరఫున అర్బన్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ అందుకున్నారు.
మెట్రో భాగ్యనగరానికి మకుటారాహారం. అలాంటి మెట్రోను ఇప్పడు ఏకంగా శంషాబాద్ వరకు పొడిగిస్తున్నట్లు సమాచారం. మెట్రో వచ్చాక నగర ప్రజల నుండి వచ్చిన అనూహ్య స్పందనే దీనికి కారణం.
రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ మరియు ఈశ్వరీబాయి ట్రస్టు ఆధ్వర్యంలో అందించే తెలంగాణ మేటి మహిళ ఈశ్వరీబాయి స్మారక అవార్డు ఈ సంవత్సరం అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్‌కు బహుకరించారు.
జీఈఎస్ సదస్సులో భాగంగా జరిగిన చర్చలో సమన్వయకర్తగా పాల్గొన్న కేటీఆర్ వాక్చాతుర్యానికి కితాబిస్తూ ,సినీ రచయిత పరుచూరి గోపాలక్రిష్ణ ట్విటర్ వేదికగా ఆయనను ప్రశంసించారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.