పాకిస్తాన్ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున జమ్ము కాశ్మీరు ప్రాంతంలోకి చొరబడినట్లు ఇంటెలిజెన్స్‌కి సమాచారం అందింది. ఈ క్రమంలో కాశ్మీరు పరిసర ప్రాంతాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా భద్రతను పటిష్టం చేయబోతున్నారు. ముఖ్యంగా దేశ రాజధానిలో పెద్ద ఎత్తున భద్రతా దళాలు కాపుగాయనున్నాయి.
ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే జమ్ము కాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కథువా రేప్ కేసు చాలా చిన్నది అని ఆయన అభిప్రాయపడ్డారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక కథువా కేసుకు సంబంధించిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన మాట్లాడారు.
జమ్ము కాశ్మీర్ కొత్త డిప్యూటీ సీఎంగా బీజేపీ నేత కవిందర్ గుప్తాను నియమించారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ రిజైన్ చేయడంతో ఆయన స్థానంలో కవిందర్ బాధ్యతలు స్వీకరించనున్నారు.
క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తను కేసు కూడా కథువా రేప్ కేసుతో సమానమేనని.. దీనిని కూడా సాధ్యమైనంత వేగంగా పరిష్కరించాలని ఆమె అధికారులకు విన్నవించుకుంటున్నట్లు తెలిపింది.
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున 5 సభ్యులతో కూడిన నిజ నిర్థారణ కమిటీ జమ్ము కాశ్మీర్‌లోని కథువా ప్రాంతాన్ని సందర్శించాలని భావిస్తోంది. ఈ మేరకు ఏప్రిల్ 19వ తేదిన సుప్రీం కోర్టు నుండి కొంత సమయం అడగనున్నట్లు తెలిపింది.
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తమ రాష్ట్ర ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న చంద్ర ప్రకాష్ గంగా, అటవీశాఖ మంత్రిగా ఉన్న లాల్ సింగ్ రాజీనామా పత్రాలను ఆమోదించారు.
జమ్ము కాశ్మీర్ రాష్ట్ర మహిళా కమీషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. 8 ఏళ్ల మైనర్ బాలిక, హత్యకేసులో తీర్పును సాధ్యమైనంత త్వరగా ప్రకటించడం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.