దేశ రాజధానిలో హై అలర్ట్.. కాశ్మీరులో పెద్ద ఎత్తున ఉగ్రవాదుల చొరబాటు

పాకిస్తాన్ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున జమ్ము కాశ్మీరు ప్రాంతంలోకి చొరబడినట్లు ఇంటెలిజెన్స్‌కి సమాచారం అందింది. ఈ క్రమంలో కాశ్మీరు పరిసర ప్రాంతాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా భద్రతను పటిష్టం చేయబోతున్నారు. ముఖ్యంగా దేశ రాజధానిలో పెద్ద ఎత్తున భద్రతా దళాలు కాపుగాయనున్నాయి. 

Last Updated : Jun 1, 2018, 12:10 PM IST
దేశ రాజధానిలో హై అలర్ట్.. కాశ్మీరులో పెద్ద ఎత్తున ఉగ్రవాదుల చొరబాటు

పాకిస్తాన్ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున జమ్ము కాశ్మీరు ప్రాంతంలోకి చొరబడినట్లు ఇంటెలిజెన్స్‌కి సమాచారం అందింది. ఈ క్రమంలో కాశ్మీరు పరిసర ప్రాంతాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా భద్రతను పటిష్టం చేయబోతున్నారు. ముఖ్యంగా దేశ రాజధానిలో పెద్ద ఎత్తున భద్రతా దళాలు కాపుగాయనున్నాయి. తాజా సమాచారం ప్రకారం సరిహద్దు రేఖ దాటి ఓ పాతికమంది ఉగ్రవాదులు భారత్ భూభాగంలోకి అడుగుపెట్టారని వార్తలు వస్తున్నాయి.

ఈ ఉగ్రవాదుల్లో అనేకమంది జైషే ఈ మహమ్మద్‌ అనే తీవ్ర వాద సంస్థకు చెందిన వారని కూడా సమాచారం. ఎప్పుడు వీరు దాడులకు తెగబడతారో తెలియదు కాబట్టి.. భద్రతా వ్యవస్థను పటిష్టం చేయనున్నట్లు.. పలుచోట్ల భారీ ఎత్తున బలగాలను మోహరించనున్నట్లు ఇప్పటికే సంబంధిత అధికారులు తెలిపారు. 

ముఖ్యంగా ఉగ్రవాదులు కాశ్మీరును టార్గెట్ చేసి భారత భూభాగంలోకి అడుగుపెట్టారని.. అయితే వారి అసలు ప్లాన్ ఏమిటన్న విషయంపై తగిన సమాచారం లేదు కాబట్టి దేశంలోని  పలు చోట్ల భద్రతా వ్యవస్థను పటిష్టం చేయాలని ప్రభుత్వం సంబంధిత అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ముఖ్యంగా హిట్ అండ్ రన్ తరహాలో ఈ ముష్కరులు దాడులు చేసే అవకాశం ఉంది కాబట్టి బలగాలు జాగరూపులై ఉండాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది.

బహుశా ఈ ఉగ్రవాదులు గ్రూపులుగా విడిపోయి కూడా పలుచోట్ల దాడులు చేసే అవకాశం ఉంది కాబట్టి అందరూ అప్రమత్తమై ఉండాలని కూడా ప్రభుత్వం తెలియజేసింది. ముఖ్యంగా రాబోయే రంజాన్ వేడుకలను పురస్కరించుకొని అల్లర్లు చేయడానికి వీరు వచ్చి ఉంటారని కూడా వార్తలు వస్తున్నాయి. 

Trending News