"వ్యవసాయ రంగానికి 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ కొత్త రికార్డు సృష్టించింది" అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇది నా స్వప్నం అని ఆనందం వ్యక్తం చేశారు. ఆయన దేశంలో మరెక్కడా లేని విధంగా చరిత్రలో తొలిసారి రాష్ట్రంలోని 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ప్రయోగాత్మకంగా 24 గంటల కరెంటు సరఫరా ప్రారంభించాం. దశాబ్దాల పాటు కరెంట్ కష్టాలు అనుభవించిన రైతులకు ఇది తీపి కబురని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి రిజిస్ట్రేషన్ సేవలు తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా జరగనున్నాయి. ఇప్పటివరకు ఈ సేవలు సంబధిత రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో మాత్రమే జరిగేవి. ఇకపై అలా కాకుండా ఎమ్మార్వోలకు కూడా రిజిస్ట్రేషన్ బాధ్యతలను కట్టబెట్టేలా చట్ట సవరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
తెలంగాణ 'ఈఒడిబీ(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)' ర్యాంకుల్లో మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచ బ్యాంకు తో కలిసి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని 'డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డిఐపిపి)' ఈ ర్యాంకులను ప్రకటిస్తుంది. తాజాగా 2017 సంవత్సరానికి గాను ఈఒడిబీ ర్యాంకుల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. హర్యానా రెండవ స్థానంలో, మూడవ స్థానంలో పశ్చిమ బెంగాల్ నిలిచాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి 15 వ ర్యాంక్ దక్కింది.
నగరవాసుల ఎదురుచూపులు తీరనున్నాయి... మెట్రో సర్వీసులు లాంఛనంగా ప్రారంభించేందుకు నవంబర్ 28న ముహూర్తం ఖరారయ్యింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా హైదరాబాదు మెట్రో రైలు పట్టాలపై కూత పెట్టనుంది. ఈ ప్రాజెక్టును మియాపూర్ డిపోలో ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కారు సన్నాహాలు చేస్తోంది. మెట్రో ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ సెప్టెంబర్ లో దిల్లీ వెళ్లి ప్రధాని మోదీని ఆహ్వానించిన విషయం తెలిసిందే..!
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకూ ఉపకార వేతనాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా 2017-18 వార్షిక సంవత్సరానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరించాలని యోచిస్తోంది. ప్రస్తుతానికి దరఖాస్తుల సమర్పణకు గడువు విధించినప్పటికీ, నెలరోజుల్లో ఉపకార వేతనాలకు సంబంధించిన అప్లికేషన్లు స్వీకరించేలా సంక్షేమ చర్యలు ఊపందుకున్నాయి.
ఎవరు అర్హులు?
బతుకమ్మ పండుగ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఆడబిడ్డలకు చీరల పంపిణీ కార్యక్రమం పలు విమర్శలకు తావిచ్చింది. సిరిసిల్ల చేనేత కార్మికులకు ఉపాధి, తెలంగాణ ఆడపడుచులకు పండుగ కానుక అనే విధానంతో ప్రభుత్వం చేపట్టిన ఈ పంపిణీ కార్యక్రమం కొన్ని వివాదాలను కూడా ఎదుర్కొంది. ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డులు ఉన్న మహిళలు ఈ చీరలను తీసుకోవడానికి బారులు తీరిన సందర్భంలో కొందరు మహిళలు చీరలు నాసిరకంగా ఉన్నాయని పేర్కొని, వాటిని కాల్చివేశారనే వార్తలు రావడంతో తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.