రామ్ గోపాల్ వర్మ తీస్తున్న "లక్ష్మీస్ ఎన్టీఆర్" సినిమా పెద్ద దుమారమే రేపుతోంది. గతంలో ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని తెలిపి.. ఆ తర్వాత ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న నిర్మాత కేతిరెడ్డి ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై రోజుకో ఆసకికరమైన కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో తాజాగా వర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఫోటోలు సంచలనంగా మారాయి. సీఎం చంద్రబాబు నాయుడు సినిమా పై విమర్శలొద్దు అని చెప్పి విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్న తరుణంలో.. వర్మ పోస్ట్ చేసిన ఈ ఫొటోలు ఎక్కడికి దారితీస్తాయో తెలియటం లేదు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఫోటోలపై ఏవిధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారనుంది.
సంచలన దర్శకుడు వర్మ ..మరో సంచలన విషయాన్ని బయటపెట్టాడు. ఎన్టీఆర్ లాంటి మహానటుడు గురించి తీస్తున్న సినిమాకు ఎంతటి ఘనమైన నటుడ్ని మాత్రమే తీసుకుంటారని అందరూ భావించారు. అయితే దీనికి భిన్నంగా ఆయన పాత్రలో నటించేందుకు కొత్త నటుడిని ఎంపిక చేసినట్లు లక్ష్మీస్ ఎన్టీఆర్ డైరెక్టర్ వర్మ సంచల ప్రకటించారు. ఓ ఇంటర్క్వూ లో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ పాత్రాలో నటించే నటుడిని తాను ఇప్పటికే ఎంపిక చేశానని చెప్పారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో ఓ కొత్త నటుడిని ఎన్టీఆర్ గా చూస్తారని పేర్కొన్నారు. ఈ సినిమాలోని ఎవరు ఏ పాత్రలో నటిస్తారో ఇప్పుడే చెప్పబోమన్నారు. ఈ సినిమాను కొందరు గుడ్ .. కొందరు బ్యాడ్ అంటున్నారు.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు బయోపిక్ "లక్ష్మీస్ ఎన్టీఆర్"కి వైఎస్సార్సీపీ నాయకుడు పి.రాకేష్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించ బోతున్నారు. ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ స్వయంగా ట్విటర్ ద్వారా తెలిపారు. "నా దర్శకత్వంలో వస్తున్న "లక్ష్మి'స్ యన్ టి ఆర్" చిత్రాన్ని నిర్మిస్తున్నది వై.ఎస్.అర్.సి.పి నేత పి.రాకేష్ రెడ్డి.....మా ఇద్దరి ఆంతరంగిక అభిమతం ఈ చిత్రాన్ని పాలిటిక్స్ కి అతీతంగా కేవలం నిజాలు చెప్పడం కోసమే తియ్యాలని" అని పోస్టు చేశారు వర్మ. అలాగే ఆ నిర్మాతతో కలిసి దిగిన ఫోటో కూడా ట్విటర్లో పోస్టు చేశారు వర్మ .
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.