Ram temple: ఢిల్లీ: అయోధ్య ( Ayodhya ) లో రామ మందిర భూమి పూజకు సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. ఆగస్టు 5న రామ మందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ( PM Narendra Modi ) శంకుస్తాపన చేయనున్నారు. మరో మూడు రోజుల్లో జరిగే ఈ వేడుక కోసం దేశం మొత్తం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో ఎన్డీఏ మిత్ర పక్షం, లోక్ జనశక్తి పార్టీ పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ( Chirag Paswan ) ట్విట్టర్ వేదికగా తన భావాలను పంచుకున్నారు. తన జీవిత కాలంలో అయోధ్య రామ జన్మ భూమిలో రామ మందిరం నిర్మితమవుతుండటం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. రామాలయం నిర్మాణం కేవలం మానవులకే కాకుండా, అన్ని జీవరాశులకు సంతోషకరమైన విషయమని చెప్పారు. శ్రీరాముడిని దేశం, జాతి వంటి చట్రాల్లో బంధించడం సాధ్యం కాదన్నారు. Also read: UP: కరోనాతో మంత్రి కమల్రాణి మృతి
वंचित वर्ग से आने वाली,गुरु मतंग की शिष्या,श्री राम की परमभक्त माता शबरी का वंशज होने के नाते यह मेरा सौभाग्य है की मेरे जीवनकाल में पुनः मंदिर का निर्माण होने जा रहा है। pic.twitter.com/9JFYBuFqj1
— युवा बिहारी चिराग पासवान (@iChiragPaswan) August 2, 2020
అయితే.. తాను రామ భక్తురాలు శబరి వంశస్థుడినని పేర్కొన్నారు. నిమ్నవర్గాల నుంచి వచ్చిన మతంగ మహర్షి శిష్యురాలు శబరి అన్నారు. మాత శబరికి అనేక సద్గుణాలు ఉన్నాయని.. అయినప్పటికీ ఆమెకు అహంకారం లేదని ట్విట్టర్లో రాశారు. అందుకే మాత శబరి కొరికి ఇచ్చిన పండ్లను శ్రీరాముడు స్వీకరించాడని.. శబరిని తన తల్లి కౌసల్యతో సమానమని చెప్పాడని పేర్కొన్నారు. Also read: Pingali Venkayya: తెలుగువారి ఆత్మగౌరవం.. పింగళి వెంకయ్య