BRS National Politics: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఆకాంక్షతో బీఆర్ఎస్ మారిన టీఆర్ఎస్ కథ ముగిసిందా..? తెలంగాణలో అధికారం కోల్పోయిన గులాబీ దండుకు పక్క రాష్ట్రాల్లోనూ షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయా..? తెలంగాణలో తప్ప మిగిలిన చోట్ల బీఆర్ఎస్ పనైపోయిందా ? గులాబీ దండు పరిస్థితి ఏంటి..? మళ్లీ ఫామ్‌లోకి భారత రాష్ట్ర సమితి ఎప్పుడొస్తుంది..?
Telangana Assembly Election 2023: డెలవరీ బాయ్స్‌తో మంత్రి కేటీఆర్ సోమవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను తెలసుకున్నారు. వారి సంక్షేమం కోసం ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పారు.
KTR Questions to Rahul Gandhi: తెలంగాణలో యువత మధ్య చిచ్చుపెట్టేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏడాదికి 16,850 ఉద్యోగాలు ఇస్తే.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం 1012 ఉద్యోగాలే ఇచ్చారన్నారు.
Minister KTR Power Presentation: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేసిన అభివృద్ధిని మంత్రి వివరించారు. తెలంగాణలో విప్లవాత్మక మార్పులు చేశామన్నారు.
Government Jobs In Telangana: బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలను www.telanganajobstats.in అనే వెబ్సైట్లో పొందుపరిచినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ వెబ్‌సైట్‌ను నేడు ఆయన ప్రారంభించారు.
Tula Uma Joins in BRS: వేములవాడ బీజేపీ టికెట్ దక్కపోవడంతో సీనియర్ నాయకురాలు తుల ఉమ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. నేడు మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరుకున్నారు. తుల ఉమకు పార్టీలో సమున్నత హోదా కల్పిస్తామని కేటీఆర్ అన్నారు.
KTR Fires On Revanth Reddy: సన్నకారు రైతులకు మూడు గంటల నాణ్యమైన విద్యుత్ సరిపోతుందంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్. ప్రజలు కరెంట్ కావాలో.. కాంగ్రెస్ కావాలో ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 3, 4 గంటల కరెంట్ కూడా రాలేదన్నారు.
Minister KTR Fell Down Video: ఆర్మూర్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ప్రచారం రథంపై నామినేషన్‌కు వెళుతుండగా.. డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో పైన గ్రిల్ వంగిపోవడంతో నేతలు కిందపడిపోయారు. కేటీఆర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి.
BRS Meeting in Uppal Constituency: కాంగ్రెస్‌లో అప్పుడే మంత్రి పదవుల పంపకం మొదలైందని.. జానా రెడ్డి తానే సీఎం అంటున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. గత ఎన్నికల ముందు కూడా ఇలానే అన్నారని.. కానీ తరువాత ఏమైందని అడిగారు. తెలంగాణ ఉద్యమంలో కనిపించని నేతలు.. ఇప్పుడు తాము సీఎం అంటూ వస్తున్నారని మండిపడ్డారు.
Minister KTR Speech at Telangana Bhavan: ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. కేసీఆర్‌ను తెలంగాణలోనే ఖతం చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎవరికీ బీ టీమ్ కాదని స్పష్టం చేశారు.
TS Politics: నిరుద్యోగ యువతి ఆత్మహత్య చేసుకుంటే.. ఆ కుటుంబం పరువును మంటగలిపేలా ప్రభుత్వం వ్యవహరించిందని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. లవ్ ఫెయిల్యూర్ వల్లే అమ్మాయి చనిపోయిందని పోలీసు అధికారి ఎలా చెబుతారని ప్రశ్నించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.