Etela Rajender's health condition:హైదరాబాద్: పాదయాత్ర చేస్తూ అస్వస్థతకు గురైన ఈటల రాజేందర్ ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈటల రాజేందర్‌కి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. ఆయన మోకాలికి ఆపరేషన్ (Etela Rajender's knee surgery) చేయాలని సూచించారు.
Etela Rajender health condition: హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రజా దీవెన యాత్ర చేస్తోన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం వీణవంక మండలంలో ప్రజాదీవెన యాత్ర చేస్తున్న సమయంలోనే ఈటల రాజేందర్ స్వల్ప అనారోగ్యం బారినపడ్డారు.
PIL filed against Dalita Bandhu scheme: దళిత బంధు పథకంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలైంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడే దళిత బంధు పథకం అమలు చేయడాన్ని సవాలు చేస్తూ ఈ పిల్ దాఖలైంది.
Peddi Reddy joins TRS ahead of Huzurabad bypolls: హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికకంటే ముందు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, హుజూరాబాద్‌కి చెందిన బీజేపీ నేత పెద్దిరెడ్డి టీఆర్ఎస్లో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్‌పై (Etala Rajender) బీజేపి అభ్యర్థిగా పోటీ చేసిన ఇనుగాల పెద్దిరెడ్డి ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
Motkupalli Narsimhulu praises CM KCR and Dalita bandhu scheme: హైదరాబాద్: దళిత బంధు పథకంపై, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ప్రశంసలు కురిపించారు. ఒక దళిత కుటుంబానికి రూ 10 లక్షలు ఇస్తానన్న కేసీఆర్ లాంటి మొనగాడు దేశంలోనే లేడని మోత్కుపల్లి నర్సింహులు కితాబిచ్చారు.
RS Praveen Kumar to join BSP: హైదరాబాద్: రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఎస్పీలో చేరనున్నారా అంటే అవుననే తెలుస్తోంది. ఈ విషయాన్ని బిఎస్పీ అధినేత్రి మాయావతి (BSP chief Mayawati) ధృవీకరించినట్టు సమాచారం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఎస్పీలోకి వస్తే.. ఆయనకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
Inugala Peddi Reddy resigned to BJP: హుజూరాబాద్: హుజురాబాద్‌లో బీజేపీ నేత ఇనుగాల పెద్ది రెడ్డి రూపంలో ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ నుంచి టికెట్ ఆశించిన పెద్దిరెడ్డి... ఈటల రాజేందర్ ను తమ పార్టీలో చేర్చుకోవడాన్ని మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
CM KCR phone call audio leaked: హైదరాబాద్: ఈటల రాజేందర్ చాలా చిన్నోడు. ఈటల రాజేందర్‌తో వచ్చేది లేదు సచ్చేది లేదు. ఈటల రాజేందర్ గురించి మాట్లాడటం చిన్న విషయం. హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని జమ్మికుంట మండలం తనుగుల ఎంపీటీసీ నిరోషా భర్త రామస్వామితో ఫోన్లో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలివి (CM KCR comments on Etela Rajender).
Motkupalli Narasimhulu: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీజేపీకి రాజీనామా చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను బీజేపీలో చేర్చుకునే విషయంలో తనకు ఒక మాట కూడా చెప్పలేదన్న మోత్కుపల్లి నర్సింహులు.. ఈటల రాజేందర్ లాంటి అవినీతిపరుడిని పార్టీలో చేర్చుకుని హుజూరాబాద్ టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏముందని మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన వ్యక్తంచేశారు.
Kaushik Reddy joins TRS ahead of Huzurabad bypolls: కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇటీవలే టీపీసీసీ కార్యదర్శి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన పాడి కౌశిక్ రెడ్డి.. కొద్దిసేపటి క్రితమే తన అనుచరులు, ఇతర స్థానిక నేతలతో కలిసి వెళ్లి సీఎం కేసీఆర్ (CM KCR) సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
FIR against RS Praveen Kumar: హైదరాబాద్: రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉద్యోగం నుంచి వాల్యుంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకున్న మరుసటి రోజే ఓ పాత కేసులో ఇరుక్కున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాల్సిందిగా కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులకు కరీంనగర్ కోర్టు (Karimnagar court) ఆదేశాలు ఇచ్చింది.
Kokapeta lands auction: హైదరాబాద్: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ (Revanth Reddy house arrest) చేశారు. కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసిన భూముల పరిశీలన, ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి కోకాపేటకు వెళ్లకుండా అడ్డుకునేందుకు భారీ సంఖ్యలో పోలీసులు ఆయన నివాసం వద్ద మోహరించారు.
Kaushik Reddy audio tapes, Kaushik Reddy to join TRS: హైదరాబాద్: హుజూరాబాద్‌కి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వేటువేసింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో (Huzurabad bypolls) టీఆర్ఎస్ పార్టీ టికెట్ తనకే ఇస్తారంటూ టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి ఓ యువకుడితో ఫోన్లో జరిపిన సంభాషణకు సంబంధించిన ఆడియో టేప్ వైరల్ అయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కౌశిక్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ టీపీసీసీకి ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే.
L Ramana joins TRS party ahead of Huzurabad bypolls: హైదరాబాద్: తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్ రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇటీవలే టీటీడీపీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన ఎల్ రమణ.. సోమవారం తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు.
Kaushik Reddy to join TRS ahead of Huzurabad bypolls: హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి హుజురాబాద్‌కి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కౌశిక్ రెడ్డి తన రాజీనామా లేఖను పంపించారు. తనకు ఇన్నేళ్లపాటు పార్టీలో అవకాశాలు కల్పించినందుకు రాహుల్ గాంధీకి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్టు కౌశిక్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.
Huzurabad bypolls, Konda Vishweshwar Reddy supports Etela Rajender: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తాను ఈటల రాజేందర్‌కు మద్ధతు పలుకుతున్నట్టు కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రకటించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల విషయంలో పార్టీలకు అతీతంగా ఈటల రాజేందర్ కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు.
Bandi Sanjay about CM KCR's districts tours: హైదరాబాద్: సీఎం కేసీఆర్ బీజేపికి భయపడ్డారని, అందువల్లే ఇటీవల గడీల నుంచి బయటికి వచ్చి జిల్లాల్లో పర్యటిస్తున్నారని బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు (Huzurabad bypolls) సహా వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు బీజేపికే పట్టం కట్టబోతున్నారని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.