Israel - Iran War: ఉత్తర గాజాలోని బీట్ లాహియాలో ఆరు భవానాలపై ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్సెస్ దాడులు చేశాయి. ఈ దాడుల్లో 35 మంది మృతి చెందారు. అదేవిధంగా ఓ ఇంటిపై జరిగిన మరో దాడిలో 10 మంది చనిపోయినట్టు సమాచారం. అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది. తాజా దాడులపై కౌన్సిల్ ఆన్ అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్ స్పందించింది. గాజాపై దాడులను ఇజ్రాయిల్ దాడులను ఆపాలన్నారు. సాధారణ పౌరుల ప్రాణాలు కాపాడాలని అమెరికాను కోరింది. ఈ దాడులను ఐడీఎఫ్ సైతం ధృవీకరించింది. హమాస్ కమాండ్ సెంటర్ లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు తెలిపింది.
మరోవైపు.. ఈ దాడులను జోర్డాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఈ దాడులు అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘించినట్టు చెబుతున్నారు. అమాయక పౌరుల లక్ష్యంగా దాడులు చేయడం దారుణమని ఎక్స్ వేదికగా స్పందించింది. మరోవైపు బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాల్లోని రెండు భవానాలను ఖాళీ చేయాలని లెబనాన్ నివాసితులకు ఇజ్రాయెల్ దళాలు హెచ్చరికలు జారీ చేసింది. ఆ ప్రాంతం లక్ష్యంగా వైమానిక దాడులు చేయనున్నట్లు తెలిపాయి.
ఇక ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు శనివారం తెల్లవారుజామున జరిపిన దాడుల్లో ఇరాన్ క్షిపణి కార్యక్రమాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఆ దేశ క్షిపణుల్లో వినియోగించే ఘన ఇంధన మిశ్రమాన్ని తయారు చేసే డజనుకుపైగా ప్రదేశాలను ధ్వంసం చేశాయి. ఇక్కడి పరికరాలను ఇరాన్ సొంతగా తయారు చేయలేదు. వీటిని చైనా లేదా మరేదైనా దేశం నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. టెహ్రాన్‌లోని అణు శక్తి కేంద్రానికి రక్షణగా ఉన్న ఎస్-300 గగనతల రక్షణ వ్యవస్థను కూడా దారుణంగా దెబ్బతీసినట్లు సమాచారం. ఇక పర్చిన్ మిలిటరీ కాంప్లెక్స్‌లో డ్రోన్ల తయారీ యూనిట్‌ను ఇజ్రాయిలీ దళాలు ధ్వంసం చేశాయి.
అరబ్ దేశాలకు చెందిన ఎల్ఫా కథనం ప్రకారం ఖెబర్, హజ్ ఖాసీం బాలిస్టిక్ క్షిపణుల్లో వినియోగించే ఘన ఇంధనాన్ని తయారు చేసే కర్మాగారం పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఇవే క్షిపణులను ఇజ్రాయెల్‌పై దాడికి గతంలో ఇరాన్ వినియోగించింది. ఈ కర్మాగారం ఇరాన్ క్షిపణి ప్రోగ్రామ్‌కు బ్యాక్ బోన్ అని చెప్పాలి. దాడి దెబ్బకు అది పనికిరాకుండా పోయింది. ఇక్కడ దాదాపు 20 హెవీ ఫ్యూయల్ మిక్సర్లు ధ్వంసమయ్యాయి. ఒక్కోదాని ఖరీదు 2 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. ఇక్కడ ఆ మిక్సర్లను తిరిగి అమర్చాలంటే కనీసం యేడాదికి పైగా సమయం పడుతుందని అంతర్జాతీయ పత్రికా కథనంలో పేర్కొంది. ఉత్పత్తి యదాతథా స్థితికి చేరాలంటే మాత్రం రెండేళ్లు పట్టొచ్చని తెలిపింది.
మరోవైపు పర్చిన్ సహా మరోచోట బాలిస్టిక్ మిసైల్ కాంప్లెక్సులు దెబ్బతిన్నట్లు ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించిన ఐక్యరాజ్య సమితి ఆయుధ ఇన్స్పెక్టర్ డేవిడ్ అల్బర్ట్, డెకర్ ఎవలెంత్ అనే సీఎన్ఏ పరిశోధకుడు పేర్కొన్నారు. పర్చిన్ మిలిటరీ కాంప్లెక్స్‌లో మూడు భవనాలు దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ ఘన ఇంధనం మిక్సర్‌ను తయారు చేయడం, ఎగుమతి చేయడంపై ఆంక్షలు ఉన్నాయి. ఈ మిక్సర్లను ఇరాన్ భారీగా సొమ్ము వెచ్చించి దిగుమతి చేసుకొంది. దీంతో ఇరాన్ పెద్ద మొత్తంలో క్షిపణులు తయారు చేసే సామర్థ్యంపై దెబ్బ పడింది. ఒక రకంగా ఇరాన్ ను తన దాడులతో ఇజ్రాయిల్ కోలుకోలేని దెబ్బ తీసింది.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter