Kusukuntla Prabhakar Reddy-KCR : మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్తి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశాడు ప్రభాకర్ రెడ్డి.
KCR Press meet: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన నేపథ్యంలో తాజాగా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో గెలుపు, ఓటములపై సీఎం కేసీఆర్ వేదాంత ధోరణిలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Munugode bypolls campaigns: మునుగోడులో ఉప ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య ప్రతీకార జ్వాలలు రాజుకుంటున్నాయి. అభ్యర్థుల అనుచరులు ఒకరిపై మరొకరు పరస్పరం దాడులు చేసుకుంటూ ఎన్నికల వేడి రాజేస్తున్నారు.
Minister Koppula Eshwar: టీఆర్ఎస్ పార్టీకి ప్రజల మద్దతు ఉందని.. తాము డబ్బుతో రాజకీయాలు చేసే వాళ్ళం కాదని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారంలో పాల్గొన్న మంత్రి కొప్పుల ఈశ్వర్.. బీజేపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Komatireddy Rajagopal Reddy: ఇంతకాలం సీఎం కేసీఆర్ సీఎం హోదాలో ఉండి జుగుప్సాకరమైన భాష వాడుతున్నారని.. ఆయన కొడుకు మంత్రి కేటీఆర్ చదువుకున్న వాడు కనుక తండ్రిలా మాట్లాడడు అనుకున్నాను కానీ కేటీఆర్ కూడా కేసీఆర్ తరహాలోనే జుగుప్సాకరమైన భాష వాడడం బాధాకరం అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
Munugode Bypoll: తెలంగాణలో మునుగోడు పాలిటిక్స్ హీట్ పుట్టిస్తోంది. అభ్యర్థులంతా ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. ఈనేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి పేరు ఖరారు అయ్యింది.
CM KCR Convoy in Munugode TRS Meeting: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో రేపు టీఆర్ఎస్ పార్టీ మునుగోడులో ప్రజా దీవెన సభ పేరిట భారీ బహిరంగ సభ తలపెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మునుగోడులో జరగనున్న ఈ ప్రజా దీవెన సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.